Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ ఒక్క ఫోన్ కాల్ తో పాక్ పై యుద్ధాన్ని నిలిపివేశాం

పహల్గామ్ లో చోటు చేసుకున్న ఘటనలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. లోక్ సభలో ప్రకటన చేశారు. నిండు సభలో దీనిపై ఆయన మాట్లాడారు. పహల్గామ్ నరమేధం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ఒక్కటొక్కటిగా ప్రస్తావించారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలనూ సంధించారు.

ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంపైనున్న ఉగ్రవాద శిబిరాలను భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, తాజాగా నిర్వహించిన ఆపరేషన్ మహదేవ్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు అమిత్ షా. రెండు రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడానికి గల కారణాలను కూడా సభకు వివరించారు.

India-Pakistan Ceasefire Agreed After DGMO Call Amit Shah Statement in Lok Sabha

మే 10వ తేదీన భారత్- పాకిస్తాన్ దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయిలో జరిగిన సంప్రదింపుల తరువాతే ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేశామని అమిత్ షా తెలిపారు. తాము చేపట్టిన దాడుల్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన స్థావరాలను కోల్పోయిందని, యుద్ధాన్ని నిలిపివేయడానికి మించి మరో ఆప్షన్ లేకుండా పోయిందని అన్నారు.

దీనితో రాజీ ప్రయత్నాలు చేపట్టిందని, డీజీఎంఓ స్థాయిలో సంప్రదింపులు నిర్వహించిందని అమిత్ షా వివరించారు. ఈ వివరణతో ఆయన.. అమెరికా డొనాల్డ్ ట్రంప్ నోటికి తాళం వేసినట్టయింది. తాను జోక్యం చేసుకోవడం వల్లే ఈ రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ప్రకటించాయని పదేపదే చెప్పుకొంటోన్న విషయం తెలిసిందే.

మే 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు భారత సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ కు పాకిస్తాన్ డీజీఎంఓ నుండి కాల్ వచ్చిందని అమిత్ షా వివరించారు. ఆ తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌కు శాంతిని కోరుకోవడం తప్ప వేరే మార్గం లేదని వ్యాఖ్యానించారు.

పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల మూలాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నేత పీ చిదంబరం చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. వారు పాకిస్తాన్ నుండి వచ్చారనడానికి తమ వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని అన్నారు. దాడి చేసినవారు పాకిస్తానీ జాతీయులని చెప్పడానికి ప్రభుత్వం వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.

తమ వద్ద ఉగ్రవాదుల ఓటరు గుర్తింపు నంబర్లు ఉన్నాయని అమిత్ షా తేల్చి చెప్పారు. అమాయక పర్యాటకులపై కాల్పులు జరపడానికి ఉపయోగించిన రైఫిల్స్, కార్ట్రిడ్జ్‌లు పాకిస్తాన్‌లో తయారయ్యాయని అన్నారు. దీనికి సంబంధించిన బలమైన సాక్ష్యాధారాలు ఉండటం వల్ల ఈ ఘాతుకానికి పాకిస్తాన్ పై అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గతంలో అరెస్టు చేసిందని హోం మంత్రి పేర్కొన్నారు. హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను శ్రీనగర్‌కు తీసుకువచ్చినప్పుడే ముగ్గురినీ గుర్తించినట్లు నిర్ధారించారు. పహల్గామ్ దాడి స్థలం నుండి స్వాధీనం చేసుకున్న కార్ట్రిడ్జ్ కేసింగ్‌లను ముందుగానే ఫోరెన్సిక్ పరీక్షకు పంపించామని షా వెల్లడించారు.

శ్రీనగర్‌లోని దచిగామ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన సులేమాన్ షా అలియాస్ హషీం ముసా, మరో ఇద్దరు ఉగ్రవాదులు ఏప్రిల్ 22వ తేదీ నాటి పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్నారని అమిత్ షా స్పష్టం చేశారు. మిగిలిన ఇద్దరికీ ఉగ్రవాదులు జీబ్రాన్, హమ్జా ఆఫ్ఘనీలకూ ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+