వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డ్ .. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను దాటిన వ్యాక్సినేషన్ హిస్టరీ !!

|
Google Oneindia TeluguNews

భారతదేశం వ్యాక్సినేషన్ లో చారిత్రక మైలురాయిని అధిగమించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఒక మహోద్యమంలా భారతదేశం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మరో కీలక ఘట్టానికి చేరుకుని రికార్డు సృష్టించింది. ప్రస్తుతం భారతదేశం వందకోట్ల మైలురాయిని అధికమించి ముందుకు సాగుతుంది. చైనా తరువాత 100 కోట్లు వ్యాక్సిన్ డోసులను అధిగమించిన రెండవ దేశంగా భారతదేశం నిలిచింది.

బిలియన్ కరోనా టీకాల మార్కును దాటిన భారత్ వ్యాక్సినేషన్

బిలియన్ కరోనా టీకాల మార్కును దాటిన భారత్ వ్యాక్సినేషన్

భారతదేశం ఒక బిలియన్ కరోనా టీకాల మార్కును సాధించింది. ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 103.5 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులు ఇచ్చినట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. 10.85 కోట్ల ఉపయోగించని టీకా మోతాదులు ఇప్పటికీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయని భారత ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇండియా ఒక చరిత్రను సృష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్ హిస్టరీ : డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించిన మోడీ


100 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు, భారత దేశ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించారు. తాము 130 కోట్ల మంది భారతీయుల సైన్స్, ఎంటర్‌ప్రైజ్ యొక్క సమిష్టి స్ఫూర్తిని చూస్తున్నామని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 100 కోట్ల టీకాలు దాటినందుకు భారతదేశానికి అభినందనలు. మన వైద్యులు, నర్సులు మరియు ఈ ఘనత సాధించడానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు, ఇది వ్యాక్సిన్ సెంచరీ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.

వ్యాక్సినేషన్ రికార్డ్ తో స్వీట్స్ పంచిన ఆరోగ్య శాఖా మంత్రి మన్సుఖ్ మాండవియా


కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ల మైలురాయిని దాటిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. పని చేసిన ప్రతి ఒక్క ఆరోగ్య కార్యక్రతకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంలో ఆయన ఢిల్లీలోని కోవిడ్ 19 వార్ రూమ్‌ను సందర్శించారు, సిబ్బందితో సంభాషించారు . అక్కడ సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేస్తూ భారతదేశం ఒక బిలియన్ కోవిడ్ 19 టీకాలు సాధించినట్లు చెప్పి వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ కూడా హాజరయ్యారు

భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ల మైలురాయిని దాటటం విశేషం : వీకే పాల్

భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ల మైలురాయిని దాటటం విశేషం : వీకే పాల్

భారతదేశంలో టీకా కార్యక్రమం ప్రారంభమైన జనవరి 16వ తేదీ నుండి నుండి కేవలం 9 నెలల్లో సాధించిన విజయమని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. ఏ దేశానికైనా 1 బిలియన్ డోస్ మార్కును చేరుకోవడం విశేషమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ వెల్లడించారు. 30% మంది భారతీయులకు రెండు డోసులతో టీకాలు వేశారు. సుమారు 10 కోట్ల మంది వ్యక్తులు ఇప్పుడు 2 వ మోతాదును పొందాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. 2 వ డోస్ తీసుకోవటానికి వారికి కూడా రిమైండర్ లను పంపాలని డాక్టర్ వికె పాల్ పేర్కొన్నారు. మొదటి మోతాదు 75% కంటే ఎక్కువ పెద్దలకు ఇవ్వబడింది, కానీ అదే సమయంలో, 25% పెద్దలు, ఉచిత టీకాలు పొందడానికి అర్హులైన వారు చాలామంది ఇప్పటికీ టీకాలు వేయబడలేదని వి కె పాల్ చెప్తున్నారు. మొదటి మోతాదు తీసుకోని వారికి టీకాలు వేయడానికి ప్రయత్నాలు ముందుకు సాగాలని, 100 కోట్ల మైలురాయిని దాటామని అలసత్వం వహించడం మంచిది కాదని డాక్టర్ వికె పాల్ స్పష్టం చేశారు.

వ్యాక్సినేషన్ రికార్డ్ పై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

వ్యాక్సినేషన్ రికార్డ్ పై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్


ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం 100 కోట్ల మైలురాయిని దాటిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో, శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధన ద్వారా వ్యాక్సిన్లను సిద్ధం చేశారని, సమిష్టి కృషి ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఆత్మ నిర్మర్ భారత్ మార్గంలో కొనసాగుతామని ఆయన వెల్లడించారు.

భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల మార్క్ దాటినందుకు డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి ప్రశంస

భారత్ 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల మార్క్ దాటినందుకు డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి ప్రశంస

ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ మైలురాయిని సాధించడంలో రైల్వే ఉద్యోగులు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. ప్రజలు పూర్తి టీకాలు పొందేలా చూసుకోవాలి. కోవిడ్ 19 వ్యాక్సిన్ లను ప్రజలంతా తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. భారత్ మరో మైలురాయిని సాధించినందుకు అభినందనలు, ఒక బిలియన్ కోవిడ్ 19 వ్యాక్సిన్ డోస్‌లు భారత్ లో నిర్వహించబడ్డాయని డబ్ల్యూహెచ్ఓ సౌత్-ఈస్ట్ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ వెల్లడించారు. బలమైన రాజకీయ నాయకత్వం, వివిధ శాఖల సంయుక్త పని తీరు, మొత్తం ఆరోగ్యం & ఫ్రంట్‌లైన్ వర్క్‌ఫోర్స్ యొక్క అంకితమైన ప్రయత్నాలు లేకుండా స్వల్ప వ్యవధిలో ఇంత అసాధారణమైన విజయం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్ సాగిందిలా..

వ్యాక్సినేషన్ సాగిందిలా..


జనవరి 16 న వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించగా, ఫిబ్రవరి 19వ తేదీకి కోటి వ్యాక్సిన్ డోసుల మార్కును దాటింది. ఏప్రిల్ 11 నాటికి 10 కోట్ల వ్యాక్సిన్ డోసుల మార్కును దాటిందని తెలుస్తుంది. జూన్ 12వ తేదీ నాటికి 25 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వగా, ఆగస్టు 6వ తేదీ నాటికి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులు, సెప్టెంబర్ 13వ తేదీ నాటికి 75 కోట్ల వ్యాక్సిన్ డోసులు, అక్టోబర్ 21వ తేదీ నాటికి వంద కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్ డోసుల పంపిణీలో మొదటి స్థానంలో చైనా ఉండగా రెండవ స్థానంలో భారత్ నిలిచింది. బ్రెజిల్, అమెరికా, ఇండోనేషియా దేశాలు వ్యాక్సినేషన్ లో భారతదేశం తర్వాత స్థానాల్లోనే ఉండటం గమనార్హం.

English summary
India has surpassed the historic milestone in vaccination. The vaccination program undertaken by India as an initiative to curb the corona epidemic has reached another milestone and set a record. India is surpassing 100 crore vaccine doses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X