భారీగా తగ్గిన కరోనా తీవ్రత - 44,877 కేసులు నమోదు: పాజిటివిటీ రేటు 3.17 శాతం..!!
దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత గణనీయంగా తగ్గింది. గత నెల మూడు లక్షలకు పైగా నమోదు అవుతూ వచ్చిన కేసులు..ఇప్పుడు 50 వేలకు దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 44,877 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. కొవిడ్ ధాటికి మరో 684 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,17,591 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.43 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 97.37 శాతానికి చేరింని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,26,31,421 కాగా, మొత్తం మరణాలు 5,08,665కి చేరాయి.
ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య 5,37,045గా నమోదైంది. ఇప్పటి వరకు మొత్తం కోలుకున్నవారు 4,15,85,711 గా ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో కొత్తగా 49,16,801 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,81,49,447 డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. తెలంగాణలో కరోనా రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,487 శాంపిల్స్ పరీక్షించగా.. 733 మందికి పాజిటివ్‌గా తేలింది.. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,82,336కు పెరిగింది.. ఇదే సమయంలో 2,850 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోవడంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య7,62,594కు చేరింది.

Recommended Video
మరో వ్యక్తి కోవిడ్‌తో కన్నుమూయగా.. ఇప్పటి వరకు 4,106 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 15,636 కేసులు యాక్టివ్‌గా ఉండా.. రివకరీ రేటు 97.48గా ఉంది. ఇక, ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 18 లక్షల మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 7,731 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 41 కోట్లు దాటగా.. మరణాల సంఖ్య 58,27,861 కు చేరింది. రష్యాలో మరో 2.03 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. మరో 229 మంది ప్రాణాలు కోల్పోయారు.జర్మనీలో ఒక్కరోజే 1.51 లక్షల మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 122 మంది మృతిచెందారు. బ్రెజిల్లో కొత్తగా 1.34 లక్షల మందికి కరోనా సోకింది. 892మంది మరణించారు. ఏపీలో కరోనా ఆంక్షల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. ఆంక్షల సడలింపు పైన రేపు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications