లోడెత్తినట్టే: దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 1,03,558 కేసులు: లక్షా 65 వేల మంది మృత్యువాత

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రతిరోజూ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు అతలాకుతలమౌతున్నాయి. రోజు గడిచే సరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నిన్నటి దాకా లక్షకు చేరువగా కనిపించిన రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య.. ఇప్పుడా మార్క్‌ను అధిగమించింది. దేశంలో కొద్దిరోజుల కిందటే ఆరంభమైన కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత బెంబేలెత్తిస్తోంది.

Recommended Video

    #Coronavirusinindia : 'Bad to Worse' - 1 Lakh Cases In 24 Hours For First Time || Oneindia Telugu
    లక్షను దాటేసిన కొత్త కేసులు..

    లక్షను దాటేసిన కొత్త కేసులు..


    దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,03,558 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షకు పైగా రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ ఆరంభమైన తరువాత ఈ ఏడాదికాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి రాలేదు. 90 వేల నుంచి లక్ష లోపు రికార్డవుతూ వచ్చాయే గానీ.. ఆ మార్క్‌ను అధిగమించలేదు. సెకెండ్ వేవ్‌లో మాత్రం ఒక్కసారిగా లాంగ్ జంప్ చేశాయి. సెకెండ్ వేవ్ ఆరంభమైన అతి కొద్దిరోజుల్లోనే రోజువారీ కేసులు అయిదంకెలను దాటడం కలకలం రేపుతోంది. కలవరపాటుకు గురి చేస్తోంది.

     కళ్లు తిరిగే వేగం..

    కళ్లు తిరిగే వేగం..

    రోజువారీ కరోనా కేసుల పెరుగుదల వరుసగా నాలుగోరోజు కూడా కొనసాగింది. రెండురోజులుగా 80 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజాగా ఆ సంక్య 90 వేల మార్క్‌ను దాటింది. ఆదివారం నాడు 93 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. 24 గంటలు గడిచే సరికి ఈ సంఖ్య 1,03,558కి చేరుకుంది. రోజువారీ కేసులు ఏ వేగంతో పెరుగుతున్నాయనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రోజువారీ కరోనా మరణాల సంఖ్య అదుపులోనే ఉంటోంది గానీ.. తగ్గుముఖం పట్టట్లేదు. కొత్తగా 478 మంది మరణించారు.

     ఏడు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు..

    ఏడు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు..

    కాగా, కొత్తగా 52,847 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,25,89,067కు చేరుకుంది. ఇందులో 1,16,82,136 మంది డిశ్చార్జ్ కాగా.. 1,65,101 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 7,41,830కు చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 7,91,05,163 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో నమోదవుతోన్న రోజువారీ కరోనా కొత్త కేసుల్లో మహారాష్ట్ర వాటా అధికంగా ఉంటోంది. సగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి.

    మహారాష్ట్ర వాటా సగానికిపైగా..

    మహారాష్ట్ర వాటా సగానికిపైగా..

    మహారాష్ట్రలో సెకెండ్ వేవ్‌లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒక్కరోజే 57,074 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంతగా అదుపు తప్పిందో అర్థం చేసుకోవచ్చు. 222 మంది కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటిదాకా అక్కడ నమోదైన మొత్తం కరోనా కేసులు 30,10,597 కాగా.. ఇందులో 25,22,823 మంది డిశ్చార్జ్ అయ్యారు. 55,878 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 4,30,503గా రికార్డయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదివారం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. వీకెండ్ లాక్‌డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+