దేశంలో కరోనా ఉప్పెన: ఒక్కరోజులో 1,52,879: కేసుల్లో నయా రికార్డ్: 1.70 వేలకు మరణాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ప్రతిరోజూ ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతున్నాయి. ఒక్క రోెజు వ్యవదిలో వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొచ్చేస్తున్నాయి. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు అతలాకుతలమౌతున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దేశంలో రోజువారీ కరోనా కేసులు లక్ష మార్క్‌ను వారం రోజుల వ్యవధలోనే లక్షన్నరను అధిగమించడం.. దాని తీవ్రత, వేగాన్ని తెలియజేస్తోంది. మహారాష్ట్రలో వారంలో మూడు రోజుల లాక్‌డౌన్ మినహా మరెక్కడా ఆ తరహా పరిస్థితుల్లేవు. రాత్రివేళ కర్ఫ్యూ కొనసాగుతోంది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,52,879 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షన్నరకు పైగా రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ ఆరంభమైన తరువాత ఈ ఏడాదికాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి రాలేదు. సెకెండ్ వేవ్‌లో మాత్రం కళ్లు తిరిగే స్పీడ్‌తో కేసులు పరుగులు పెడుతున్నాయి. కొత్తగా 90,584 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,33,58,805కు చేరుకుంది. ఇందులో 1,20,81,443 మంది డిశ్చార్జ్ కాగా.. 1,69,275 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 11,08,087కు చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 10,15,95,147 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవంక- కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నాయి. 25,66,26,850 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 14,12,047 టెస్టింగులను చేపట్టినట్లు తెలిపింది.
Recommended Video
దేశంలో నమోదవుతోన్న రోజువారీ కరోనా కొత్త కేసుల్లో మహారాష్ట్ర వాటా అధికంగా ఉంటోంది. సగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో సెకెండ్ వేవ్‌లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం ఒక్కరోజే 55,411 కేసులు నమోదయ్యాయి. 309 మంది కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటిదాకా అక్కడ నమోదైన మొత్తం కరోనా కేసులు 33,43,951 కాగా.. ఇందులో 27,48,153 మంది డిశ్చార్జ్ అయ్యారు. 57,638 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 5,36,682గా రికార్డయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్రలో వీకెండ్ లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం.












Click it and Unblock the Notifications