వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కరాళం: భారత్‌లో 97 వేల మందికిపైగా మృతి: కుప్పలు తెప్పలుగా కేసులు: 62 లక్షలు దాటి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్.. దేశ ప్రజల ప్రాణాలను తినేస్తోంది. రోజూ వందలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా మరణాల సంఖ్య.. అనూహ్యంగా పెరుగుదల బాట పట్టింది. ఈ మధ్యకాలంలో కరోనా మరణాల సంఖ్యలో కొద్దిగా క్షీణత కనిపించినప్పటికీ.. అది ఒకట్రెండు రోజులకే పరిమితమైంది. తాజాగా ఆ సంఖ్య మళ్లీ పెరిగింది. మరోసారి 1100లకు పైగా కరోనా మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా వైరస్ కాటుకు బలైన వారి సంఖ్య క్రమంగా లక్షకు చేరువ అవుతోంది. రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల్లోనూ పెరుగుదల కనిపించింది.

షటప్ మ్యాన్: ట్రంప్ ఫైర్: ఒబామా కేర్‌పై వాడివేడిగా ట్రంప్-బిడెన్ మధ్య డిబేట్: భారత్ ప్రస్తావనషటప్ మ్యాన్: ట్రంప్ ఫైర్: ఒబామా కేర్‌పై వాడివేడిగా ట్రంప్-బిడెన్ మధ్య డిబేట్: భారత్ ప్రస్తావన

దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 80,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 1,179 మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 62,25,764కు చేరుకుంది. ఇప్పటిదాకా 97,497 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 9,40,441కి చేరుకుంది. 51,87,826 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్‌ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు. కరోనా మరణాలు లక్షకు చేరువ అవుతుండటం ఏ మాత్రం ఊహించలేని పరిణామమని అధికారులు చెబుతున్నారు.

 India records 80472 new COVID19 cases and 1179 deaths in last 24 hours

కరోనా వైరస్ మరణాల్లో భారత్.. ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో, బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్నాయి. అమెరికాలో ఇప్పటిదాకా 2,10,785 మంది మరణించారు. బ్రెజిల్ ఈ సంఖ్య 1,43,010గా నమోదైంది. భారత్‌లో లక్షకు చేరువ అయింది. మెక్సికో నాలుగో స్థానంలో ఉంది. 77,163 మంది ఇప్పటిదాకా మెక్సికోలో కరోనా వల్ల మృతిచెందారు. కరోనా మరణాల్లో ఇదివరకు మెక్సికో మూడో స్థానంలో భారత్.. ఆ దేశాన్ని అధిగమించింది. ఈ స్థాయిలో కరోనా మరణాలు మరే దేశంలోనూ సంభవించలేదు. 42,072 మరణాలతో బ్రిటన్ అయిదో స్థానంలో ఉంది.

Recommended Video

IPL 2020,DC vs SRH Highlights : Hyderabad Defeated Delhi By 15 Runs || Oneindia Telugu

రాష్ట్రాల్లో అనూహ్య సంఖ్యలో పుట్టుకొస్తోన్న కొత్త కేసుల వల్ల దేశవ్యాప్తంగా లక్ష వరకు రోజువారీ లెక్కలు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచి గురువారం వరకూ నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య ఏడున్నర కోట్లకు చేరువైంది. ఇప్పటిదాకా 7,41,96,729 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజులో 10,86,688 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

English summary
Biggest spike of 80,472 new COVID19 cases and 1,179 deaths reported in India last 24 hours. The total case tally stands at 62,25,764 including 9,40,441 active cases. The total discharged numbers registered as 51,87,826 and 97,497 deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X