భారీగా తగ్గిన కరోనా కేసులు - 865 మరణాలు : ఆ రాష్ట్రంలో అత్యధికంగా నమోదు..!!

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జరిపిన 14,48,513 పరీక్షల్లో 1,07,474 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 865 మంది మరణించారు. 2,13,246 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళలో అత్యధికంగా 33,538 కేసులు నమోదు కాగా.. కర్ణాటకలో 12,009 కేసులు.. మహారాష్ట్రలో 11,394 కేసులు రిజిస్టర్ అయ్యాయి. తమిళనాడులో 7,524 కేసులు నమోదు కాగా.. తమిళనాడులో 7,524 కేసులు రిజిస్టర్ అయ్యాయి.

యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 2.90 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 95.91 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మరణాల సంఖ్య 5,01,979 కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 12,25,011 గా ఉన్నాయి. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,04,61,148 గా రిజిస్టర్ అయ్యాయి. ఇక, దేశంలో కొత్తగా 45,10,770 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,69,46,26,697 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 22 లక్షల మందికి కరోనా సోకింది. 8 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

India reported 1,07,474 new Covid-19 cases, recovery rate now stands at 95.91 per cent.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 39.39 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 5,751,840 కు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగానూ కరోనా కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. అమెరికాలో కొత్తగా 2.05 లక్షల మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 1,051 మంది మరణించారు.ఫ్రాన్స్​లో కొవిడ్​ విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 2.14 లక్షలకు పైగా కొవిడ్​ కేసులు వెలుగు చూశాయి. మరో 170 మంది చనిపోయారు.బ్రెజిల్​లో కొత్తగా 1.54 లక్షల మందికి వైరస్​ సోకగా.. 800 మంది చనిపోయారు.రష్యాలో తాజాగా 1.77 లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడగా.. 714 మంది బలయ్యారు.జర్మనీలో ఒక్కరోజే దాదాపు 1.66 లక్షల మందికి వైరస్ సోకింది. మరో 98 మంది మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+