Covid Cases In India: తగ్గిన కేసులు - భారీగా పెరుగుతున్న మరణాలు: 11.69 శాతంగా పాజిటివిటీ రేటు..!!
దేశంలో డిసెంబర్ చివరి వారం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన కరోనా కేసులు...జనవరిలో నిత్యం మూడు లక్షలకు పైగా చేరాయి. క్రమేణా తగ్గుతూ ఇప్పుడు రెండు లక్షల దిగువకు చేరాయి. ఒక్కరోజులో.. 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. 1192 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 2,54,076 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 4,14,69,499 కాగా, మరణాలు 4,96,242 రికార్డు అయ్యాయి.

పెరుగుతున్న రికవరీ రేటు
ఇక, యాక్టివ్ కేసులు 17,43,059 ఉండగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,92,30,198 గా నమోదైంది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 4.20 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసుల కట్టడి చర్యల తో పాటుగా వ్యాక్సినేషన్ ను సైతం కేంద్రం వేగవంతం చేసింది.
అందులో భాగంగా.. సోమవారం 61,45,767 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,66,68,48,204కు చేరింది. అదే సమయంలో.. దేశవ్యాప్తంగా 14 లక్షల 28 వేల 672 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్ట్‌ల సంఖ్య 73 కోట్లు దాటింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ తగ్గుముఖం
ఏపీ, తెలంగాణలో తగ్గుముఖం పడుతున్నాయి పాజిటివ్ కేసులు.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,284 శాంపిల్స్ పరీక్షించగా.. 5,879 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 9 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 3,24,70,712 టెస్ట్‌లు నిర్వహించగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 22,76,370కు చేరుకుంది.. రికవరీ కేసులు 21,51,238కు పెరిగాయి..
మృతుల సంఖ్య 14,615కే చేరుకున్నాయి.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,10,517 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా నిర్దారించారు. తెలంగాణలో గత 24 గంటల్లో 2,861 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ముగ్గురు మృతిచెందారు.. ఇదే 4,413 మంది కోలుకున్నారు.. ఇదే సమయంలో 4,413 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
Recommended Video

ప్రపంచ వ్యాప్తంగా ఉద్ధృతి
దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,63,911కు చేరుకోగా.. రికవరీ కేసుల సంఖ్య 7,22,654కు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 20,18,209 మందికి కరోనా సోకింది. 7,617 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 37,77,21,704కు చేరగా.. మరణాల సంఖ్య 56,91,213కు పెరిగింది. అమెరికాలో కొవిడ్ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 274266 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 1153 మంది మరణించారు.












Click it and Unblock the Notifications