భారత్‌లో 40వేల దిగువకు కరోనా కొత్త కేసులు, వెయ్యిలోపు మరణాలు: 3 కోట్లకుపైగా పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరణాలు కూడా క్షీణిస్తున్నాయి. కొత్తగా 40వేల లోపు కరోనా కేసులు, వెయ్యి లోపు మరణాలు సంభవించాయి. అదే సమయంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య రెట్టింపుగా ఉంది. మొత్తం కేసులు 3 కోట్లు దాటాయి. మరణాలు 4 లక్షలు దాటాయి.
ఆదివారంనాడు దేశంలో 15,22,504 నమూనాలను పరీక్షించగా.. 39,796 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 723 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,45,433కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 4,02,005కు చేరింది. అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో మూడో స్థానంలో భారత్ కొనసాగుతోంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి.

గత 24 గంటల్లో 42,352 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,82,071 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 97.11 శాతానికి పెరిగింది. వరుసగా 52 రోజులుగా కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి.
Recommended Video
ఆదివారంనాడు 14,81,583 మంది టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 35,28,92,046కు చేరింది. అక్టోబర్-నవంబర్‌లో థర్డ్ వేవ్ వస్తుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు తీసుకోకుంటే మరోసారి కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications