కరోనా కేసుల తగ్గుముఖం - పెరుగుతున్న మరణాలు : 14.50 శాతంగా పాజిటివిటీ రేటు..!!

దేశ వ్యాప్తంగా గత పదిహేను రోజులుగా పెరుగుతూ వచ్చిన కరనా కేసులు..తగ్గముఖం పట్టాయి. క్రమేణా కేసులు తగ్గుతున్నాయి. మూడు లక్షలకు పైగా నమోదవుతూ వచ్చిన కేసులు ఇప్పుడు రెండు లక్షల పైగా రికార్డు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,34,281 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. అయితే, అదే సమయంలో మరణాల సంఖ్య పెరగటం కొంత ఆందోళనకు కారణమవుతోంది. వైరస్​తో మరో 893 మంది మరణించారు. 3,52,784 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

75 శాతం మందికి రెండు డోసులు పూర్తి

75 శాతం మందికి రెండు డోసులు పూర్తి

ఇదే సమయంలో దేశంలోని 75 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,10,92,522గా రికార్డు అయింది. అదే విధంగా మొత్తం మరణాలు 4,94,091 గా నిర్దారించారు. ఇక, ప్రస్తుతం 18,84,937 యాక్టివ్ కేసులు ఉండగా... 3,87,13,494 మంది కరోనా నుంచి కోలుకున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం వేగంగా సాగుతోంది. శనివారం ఒక్కరోజే 62,22,682 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,65,70,60,692కు చేరింది. అధిక స్థాయిలో కేసులుల నమోదవుతూ ఆందోళన చెందిన రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుతున్నాయి. కేరళలో శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం మరో 50,812 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 8 మంది వైరస్​కు బలయ్యారు.

క్రమేణా తగ్గుతున్న పాజిటివ్ కేసులు

క్రమేణా తగ్గుతున్న పాజిటివ్ కేసులు

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 59.31 లక్షలు దాటింది. మరణాలు 53,191కి చేరాయి. 47,649 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కర్ణాటకలో వైరస్​ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. శనివారం కొత్తగా 33,337 మందికి వైరస్​ సోకింది. మరో 70 మంది వైరస్​కు బలయ్యారు. 69,902 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 19.37 శాతంగా ఉంది. రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత..రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో అమలులో ఉన్న రాత్రి కర్ఫ్యూ ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, కేరళ, గోవాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు తప్పనిసరి నిబంధనలు అమలులోనే ఉంటాయని పేర్కొంది. ఢిల్లీలో కరోనా వైరస్​ తగ్గుముఖం పట్టింది. అయితే.. శుక్రవారంతో పోలిస్తే 400కుపైగా కేసులు పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ స్వల్ప తగ్గుదల

తెలుగు రాష్ట్రాల్లోనూ స్వల్ప తగ్గుదల

శనివారం 4,483 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మరో 28 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 7.41గా ఉంది. మొత్తం కేసులు 18.23 లక్షలు, మరణాలు 25,797కు చేరాయి. ఈనెల 31 నుంచి త్రిపురలో పాఠశాలల పునర్​ప్రారంభంత్రిపురలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర సర్కార్​. జనవరి 31 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, మదర్సాలను తిరిగి తెరిచేందుకు అనుమతించింది. పూర్తిస్థాయి కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కేసులు తగ్గాయి. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తిరిగి పాఠశాలలను నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీలో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+