దాపురించిన థర్డ్‌వేవ్: కరోనా, ఒమిక్రాన్ జాయింట్ అటాక్: దేశంలో 22 వేలకు పైగా కొత్త కేసులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ భీకరంగా విస్తరిస్తోంది. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే- ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో వందకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో మళ్లీ మొదటికొచ్చింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 22 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ ముప్పు దాపురించిందనే సంకేతాలు ఇస్తోన్నాయి.

ఒక్కరోజులో 10 వేల వరకు..

ఒక్కరోజులో 10 వేల వరకు..

దేశంలో కొత్త కేసులు అనూహ్యంగా పెరుగుదల బాట పట్టాయి. ఒక్కరోజు వ్యవధిలోనే 10 వేల కేసులు రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 22,775 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 406 మంది ఈ మహమ్మారి బారిన పడి మరణించారు. 8,949 మంది కోలుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 98.32 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసులు 1,04,781కు చేరుకున్నాయి.

మరణాల్లో మూడో స్థానంలో..

మరణాల్లో మూడో స్థానంలో..

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంటోంది. ఇప్పటిదాకా 4,81,486 మంది కరోనా వైరస్ కాటుకు బలి అయ్యారు. భారత్ కంటే ముందు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్‌లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికా-8,46,905, బ్రెజిల్-,619,109 మంది మరణించారు. ఆ తరువాతి స్థానంలో భారత్ నిలిచింది. మరోవంక వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది.

ఒమిక్రాన్ విజృంభణ..

ఒమిక్రాన్ విజృంభణ..

కరోనాకు తోడుగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. ఇప్పటిదాకా ఒమిక్రాన్ వేరియంట్ 23 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,431కి చేరింది. ఇందులో 488 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యంతో కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 943గా రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రాలవారీగా వాటి సంఖ్యను వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రాలవారీగా..

రాష్ట్రాలవారీగా..

మహారాష్ట్ర-454, ఢిల్లీ-351, తమిళనాడు-118, గుజరాత్-115, కేరళ-109 కేసులతో తొలి నాలుగు స్థానంలో ఉన్నాయి. వందకు పైగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలుగా నిలిచాయి. రాజస్థాన్-69, తెలంగాణ-62, హర్యానా-37, కర్ణాటక-34, ఆంధ్రప్రదేశ్-17, పశ్చిమ బెంగాల్-17, ఒడిశా-14 కేసులు రికార్డయ్యాయి. మధ్యప్రదేశ్-9, ఉత్తర ప్రదేశ్-8, ఉత్తరాఖండ్-4, చండీగఢ్-3, జమ్మూకాశ్మీర్-3, అండమాన్ నికోబార్-2 కేసులు వెలుగులోకి వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్, లఢక్, మణిపూర్, పంజాబ్‌లల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

బూస్టర్ డోసులు..

బూస్టర్ డోసులు..

ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ కేసులు పెరుగుతోండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కఠిన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి. దీనితోపాటు బూస్టర్ డోసులను అందుబాటులోకి తీసుకుని రానుంది కేంద్ర ప్రభుత్వం. జనవరి 10వ తేదీ నుంచి బూస్టర్ డోసులను వేయడానికి సన్నాహాలు చేస్తోంది. 15 నుంచి 18 సంవత్సరాల్లోపు వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం రిజిస్ట్రేషన్‌ను ఇవ్వాళ్టి నుంచి ఆరంభమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+