భారత్‌లో తొలి బర్డ్ ఫ్లూ మరణం: ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ 11 ఏళ్ల బాలుడు మృతి

న్యూఢిల్లీ: భారతదేశంలో తొలి బర్డ్ ఫ్లూ మానవ మరణం సంభవించింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 11 ఏళ్ల బాలుడు మంగళవారం మృతి చెందాడు. భారతదేశంలో ఈ ఏడాది నమోదైన తొలి హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ఫ్లూయెంజా(బర్డ్ ఫ్లూ) మరణం ఇదే కావడం గమనార్హం.

జనవరి నెలలో పలు రాష్ట్రాల్లో కాకులు, ఇతర పక్షులు మరణించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పక్షుల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించిందని వాటి నమూనాలను పరీక్షించిన అనంతరం తేలింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తికి ఎక్కువగా ఉండటంతో మహారాష్ట్ర కూడా హైఅలర్ట్ ప్రకటించింది.

India reports this years first bird flu death: 11-year-old Boy Succumbs at AIIMS Delhi.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా.. హెచ్5ఎన్8 బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ వేరియంట్ అని తేలింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా.. హెచ్5ఎన్1గా తేలింది.

బాంబే వెటర్నరీ కాలేజీ డాక్టర్ ఏఎస్ రాణడే గత జనవరిలో ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ.. హెచ్5ఎన్1 వైరస్ మనషులకు వ్యాపించే అవకాశం ఉందని, అయితే తూర్పు ఆసియా దేశాలతో పోల్చితే ఇది మనదేశంలో చాలా తక్కువ ప్రభావం చూపుతుందన్నారు. ఇదుకు మన ఆహారపు అలవాట్లే కారణమని అన్నారు.

Recommended Video

    Covid-19 Third Wave లో భారత్ లో రోజుకు 1 లక్ష కేసుల నమోదుకు అవకాశం - ICMR | Oneindia Telugu

    ఈ బర్డ్ ఫ్లూ వైరస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ వేడిలో జీవించలేదని రాణడే తెలిపారు. తూర్పు ఆసియా దేశాల్లో కాకుండా.. భారతదేశంలో కోడిగ్రుడ్లను కానీ, మాంసాన్ని కాని బాగా ఉడికించిన తర్వాతే తింటారు. దీంతో ఈ భారీ ఉష్ణోగ్రత (100 డిగ్రీల కంటే ఎక్కువ)కు ఆ వైరస్ చచ్చిపోతుంది. అప్పుడు ఆ ఆహారాన్ని తిన్నా కూడా మనషులకు బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించే అవకాశం ఉండదని చెప్పారు. ఎక్కువగా పక్షులు, జంతువుల్లో వచ్చే ఈ బర్డ్ ఫ్లూ మనుషులకు అరుదుగా వ్యాపించే అవకాశాలున్నాయని తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+