శ్రీనగర్-షార్జా విమానాలకు మీ గగనతలం వాడుకోనివ్వండి-పాకిస్తాన్ కు భారత్ అభ్యర్ధన
కశ్మీర్ నుంచి విదేశాలకు రాకపోకలు పెంచే క్రమంలో కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయానికి పాకిస్తాన్ అడ్డుపుల్ల వేసింది. కశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి షార్జాకు దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత కేంద్రం కొత్తగా ఓ విమాన సర్వీసు ప్రారంభించింది. అయితే ఈ విమానం పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సి ఉండటంతో ఇమ్రాన్ ఖాన్ సర్కార్ దీనికి నిరాకరించింది. తాము వివాదాస్పదంగా భావించే కశ్మీర్ నుంచి షార్జాకు విమానాలు వెళ్లేందుకు తమ గగనతలం వాడుకోవాలన్న భారత్ నిర్ణయాన్ని కౌంటర్ చేసింది. దీంతో భారత్ ఇరుకునపడింది.
శ్రీనగర్-షార్జా విమాన సర్వీసును పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లేందుకు ఆ దేశం అనుమతి నిరాకరించింది. దీంతో సదరు విమానాలు ఇప్పుడు జైపూర్, ఢిల్లీ మీదుగా చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఇందుకోసం గంటసేపు అదనపు సమయం పట్టడంతో పాటు ఖర్చు కూడా పెరుగుతోంది. దీంతో కేంద్రం ప్రయత్నానికి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలినట్లయింది.. ఈ నేపథ్యంలో కశ్మీర్ లోని రాజకీయ పార్టీలు కేంద్రం జోక్యం కోరాయి. దీంతో కేంద్రం ఇవాళ స్పందించింది.

Recommended Video
సాధారణ ప్రజలు, ప్రయాణికుల్ని దృష్టిలో ఉంచుకుని శ్రీనగర్-షార్జా విమానాలకు తమ గగనతలంలో ప్రయాణానికి అనుమతి ఇవ్వాల్సిందిగా భారత్ అధికారులు ఇవాళ పాకిస్తాన్ ను కోరారు. అక్టోబర్ 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించిన తొలి గో ఫస్ట్ విమానం 23, 24, 26, 28 తేదీల్లో పాకిస్తాన్ గగనతలం మీదుగానే వెళ్లింది. అయితే ఆ తర్వాత పాకిస్తాన్ అనుమతి నిరాకరించింది. దీంతో భారత్ కు ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో జోక్యం చేసుకున్న భారత అధికారులు ప్రస్తుతానికి పాకిస్తాన్ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకూ మాత్రమే దీనిపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ మధ్యలో దౌత్య మార్గాల ద్వారా క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications