ఎలాన్ మస్క్ సొంతమైన ట్విటర్.. స్పందించిన భారత్

ట్విటర్‌ను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. యజమానులెవరైనా సరే భారతదేశ చట్టాలను అనుసరించాలి.. గౌరవించాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియా సంస్థలు అనుసరించాల్సిన నిబంధనలు, చట్టాలు యజమానులతో సంబంధం లేకుండానే కొనసాగుతాయని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ట్విటర్‌లో నిషేధం ఎదుర్కొంటున్నవారిపై ప్రభుత్వ స్పందన గురించి అడగ్గా.. మంత్రి స్పందించారు. అతి త్వరలోనే సవరణ చేసిన కొత్త ఐటీ నిబంధనలు విడుదల కానున్నాయని, వీటికోసం కొన్ని నెలలపాటు సంప్రదింపులు జరిగాయని చెప్పారు.

నకిలీ వార్తలను ప్రసారం చేసేలా ఉండే కొన్ని కంటెంట్లను, ఖాతాలను ట్విటర్ నుంచి తొలగించాలని, ఇవి నిబంధనలకు విరుద్ధమని ట్విటర్‌ను కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో పలుమార్లు ఆదేశించింది. అయితే వాటిని తొలగించేందుకు ట్విటర్ అంగీకరించడం లేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం ప్రభుత్వానికి, ట్విటర్ మధ్య వివాదానికి దారితీసింది.

India respond on Elon Musks own Twitter

పలు నాటకీయ పరిణామాల అనంతరం ట్విటర్ కొనుగోలు ప్రక్రియను మస్క్ పూర్తిచేశారు. దీనిపై బాలీవుడ్ నటి కంగనా రౌన్ త్ స్పందించారు. విద్వేషపూరిత వ్యవహారశైలితో సంస్థ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆమెపై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేయాలంటూ నెటిజన్లు మస్క్ కు అభ్యర్థించారు. వాటిని కంగన షేర్ చేశారు. మస్క్ సొంతమైన తర్వాత ట్విటర్ గతంలోలా స్వేచ్ఛగా పనిచేయలేదని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తెలియజేయలేరంటూ మస్క్ పై విమర్శలు వస్తున్నారు. ఆయన వ్యవహారశైలి కూడా వారి వాదనలకు బలం చేకూర్చేలానే ఉండటం గమనార్హం. ట్విటర్ ప్రయాణం ఏ మలుపులు తిరుగుతుందో స్పష్టత రావాలంటే కొంచెం ఓర్పు వహించాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+