వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోనే తొలి సారిగా: డిసెంబర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైల్వే స్టేషన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైల్వే స్టేషన్ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానుంది. దేశంలోనే తొలిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ ఈ రైల్వే స్టేషన్‌ను నిర్మించింది. ప్రస్తుతం ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయిందని త్వరలో మరిన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుందని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం గుజరాత్‌లోని గాంధీనగర్ , భోపాల్‌లోని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్లకు మెరుగులు దిద్దుతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

విమానాశ్రయంలో ఏవైతే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలు ఉంటాయో హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్లో కూడా ఇలాంటివి దర్శనమిస్తాయని రైల్వేశాఖ తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తవుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రయాణికులకు కావాల్సిన అన్ని సదుపాయాలను పూర్తి చేసినట్లు ఐఆర్ఎస్‌డీసీ ఎండీ మరియు సీఈఓ ఎస్‌కే లోకియా తెలిపారు. కొన్ని అనుమతులు రావడంలో ఆలస్యమైనందున పనులు నిలిచిపోయాయని చెప్పారు. అయితే డిసెంబర్ చివరికల్లా ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామనే విశ్వాసం లోకియా వ్యక్తం చేశారు.

Indias First International standards railway station to be ready by this December

ఇక పలు రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధిలో భాగంగా ఎంట్రీ/ఎగ్జిట్‌లను డెవలప్ చేసినట్లు చెప్పారు. ప్రయాణికులను పలు మార్గాల ద్వారా పంపే ఏర్పాట్లు చేసినట్లు లోకియా చెప్పారు. రద్దీని కూడా నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఇతర రవాణా సౌకర్యం పొందేందుకు బస్‌స్టాప్‌లు, దగ్గరలోనే మెట్రో, పిక్ అండ్ డ్రాప్ ఫెసిలీటీలను డెవలప్ చేయనున్నట్లు లోకియా చెప్పారు. హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో పాటు బన్సల్ గ్రూప్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తునట్లు చెప్పారు. ఇక హబీబ్ గంజ్ పునారాభివృద్ధికి రూ.100 కోట్లు ఖర్చు అవుతుండగా.. మరో రూ.350 కోట్లు కమర్షియల్ డెవలప్‌మెంట్ కోసం ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. జర్మనీలో ఉన్న హైడెల్‌బర్గ్ రైల్వే స్టేషన్ తరహాలో హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్‌ను డెవలప్ చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

ఇక ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణలు:

1. ఎంట్రెన్స్‌లో గ్లాస్ డోమ్ ఏర్పాటు
2. ఎల్‌ఈడీ లైటింగ్, నీరు వృధాకాకుండా తిరిగి వినియోగించుకునే సెటప్
3.స్టేషన్‌లో ఫుడ్ స్టాల్స్, కేఫెటేరియాల ఏర్పాటు
4.అత్యాధునిక వెయిటింగ్ లాంజ్‌లు, అత్యాధునిక టాయిలెట్స్, వరల్డ్ క్లాస్ ఇంటీరియర్స్, గేమింగ్ జోన్ల ఏర్పాటు
5. ప్రయాణికులు రైలు దిగి ప్లాట్‌ఫాంలపైకి చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, స్టేషన్‌కు తూర్పు దిక్కున స్పా, హోటళ్లు, ఇతర కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.

ఇక హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ తర్వాత గాంధీనగర్ రైల్వే స్టేషన్, సూరత్ రైల్వే స్టేషన్, చండీగఢ్, ఆనంద్ విహార్, బయ్యప్పన్నహళ్లి రైల్వే స్టేషన్లను కూడా పునరాభివృద్ధి చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.

English summary
Indian Railway passengers will be able to enjoy world-class facilities at India's first private international standard railway station by the end of this year. Ministry of Railways is working on the redevelopment of railway stations in phases. Presently, the work of redevelopment is in progress at Gandhinagar(Gujarat) and Habibganj(Bhopal) stations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X