భారతదేశం మొదటి ఓటరు, 100 ఏళ్లు, నేడు మళ్లీ హిమాచల్ ప్రదేశ్ లో ఓటు వేశారు !

Posted By:
Subscribe to Oneindia Telugu

సిమ్లా: స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో మొట్ట మొదటిసారి అందరి కంటే ముందు ఓటు వేసిన ఓటరు గురువారం (నవంబర్ 9వ తేదీ) మరోసారి ఓటు వేసి రికార్డు సృష్టించాడు. హిమాచల్ ప్రదేశ్ లో గురువారం జరిగిన శాసన సభ ఎన్నికల్లో శ్యామ్ శరణ్ నేగి (100) ఓటు వేశారు.

గురువారం శ్యామ్ శరణ్ నేగి, ఆయన భార్య హీరా మణి కిన్నౌర్ జిల్లాలోని కల్పలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. వందేళ్లు పూర్తి అయిన శ్యామ్ శరణ్ నేగి మీడియాతో మాట్లాడుతూ ఏ ఒక్క సారి తాను ఎన్నికల్లో ఓటు వెయ్యకుండా ఉండలేదని గుర్తు చేసుకున్నారు.

India’s first Voter votes in Kinnaur in Himachal Pradesh

మనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసి గెలిపించుకోవడం మన హక్కు, పత్రి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్బంగా శ్యామ్ శరణ్ నేగి ప్రజలకు పిలుపునిచ్చారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు 275 కిలో మీటర్ల దూరంలో శ్యామ్ శరణ్ నేగి నివాసం ఉంటున్నారు.

శ్యామ్ శరణ్ నేగి ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగం చేస్తూ 1975లో రిటైడ్ అయ్యారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1951 అక్టోబర్ నెలలో జరిగిన మొట్టమొదటి లోక్ సభ ఎన్నికల్లో దేశంలో ముందుగా ఓటు వేసిన శ్యామ్ శరణ్ నేగి రికార్డుల్లో నిలిచారు. ఇప్పటి వరకు ఆయన హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో 68 సార్లు ఓటు వేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Shyam Saran Negi, Himachal Pradesh's oldest voter aged 100, and his wife on Thursday cast their votes at a picturesque hamlet in Kinnaur district as elections were held to elect the 68-member assembly in the hill state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి