కాళ్ల బేరానికి వచ్చిన దాయాది పాకిస్థాన్
సరిహద్దుల్లో కాల్పులతో పేట్రేగుతున్న పాకిస్థాన్ సైన్యం ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చింది.
గోవా: సరిహద్దుల్లో కాల్పులతో పేట్రేగుతున్న పాకిస్థాన్ సైన్యం ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చింది. పాక్ విజ్ఞప్తి మేరకు మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్లు హాట్ లైన్ లో చర్చించి కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు.
ఎల్ వోసీ వద్ద అనుమానిత ఉగ్రవాదులు ముగ్గరు భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మన సైనికుడి శరీరాన్ని ముక్కలు చేయ్యడంతో భారత్ ఆర్మీ రగిలిపోయింది.
పాక్ సైన్యానికి మరింత దీటుగా జబాబు ఇచ్చింది. ఈ నేపధ్యంలో పాక్ అధికారులు హడలిపోయారు. భారత సైన్యం జరిపిన షెల్లింగ్ దాడుల్లో 11 మంది పాక్ పౌరులు, ముగ్గురు జవాన్లు చనిపోయారని పాక్ స్వయంగా చెప్పింది.

భారత్ దెబ్బకు దిగి వచ్చిన పాక్ చివరికి కాళ్ల బేరానికి వచ్చింది. ఈ విషయంపై రక్షణ శాఖా మంత్రి మనోహర్ పరీకర్ గోవాలో జరిగిన ఓ సభలో స్పందిస్తూ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా భారత్ నాయకత్వం బలమైన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.
మన సైన్యం వీరోచితమైనదనే విషయంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. అదే విధంగా తొలిసారి దేశ రాజకీయ నాయకత్వం కూడా బలమైన నిర్ణయాలు తీసుకుంటుందని గుర్తు చేశారు.
పాక్ పిరికిపందల దాడులకు మేం దీటుగా బదిలిస్తున్నాం, కొన్ని రోజులుగా బలంగా ప్రతిస్పందిస్తుండటంతో వాళ్లు దిగొచ్చి కాళ్లు పట్టుకుంటున్నారు, కాల్పులు ఆపడానికి మాకేం అభ్యంతరం లేదు, కాని పాక్ కూడా ఆపితే అప్పుడే సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం ఉంటుందని మనోహర్ పరీకర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications