భాష మూలంగా భారత లౌకికవాదం నాశనం కాదు: బెర్లిన్‌లో మోడీ(ఫోటోలు)
న్యూఢిల్లీ: భారతదేశంలో లౌకికవాదం చాలా బలమైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జర్మనీలోని హనోవర్ పర్యటన ముగించుకుని బెర్లిన్ చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భాష వల్లనో, మరే కారణం చేతనో భారత్‌లోని లౌకికవాదం నాశనం కాదని అన్నారు.
ఇండియాలో ఏమి లేనప్పుడు, కొన్ని దశాబ్దాల క్రితం జర్మనీలో రేడియోలో సంస్కృత వార్తలు వచ్చేవని మోడీ గుర్తు చేశారు. 'జర్మన్లను అభినందిస్తున్నాను. మనదేశంలో సంస్కృతంలో న్యూస్ బులిటెన్లు లేవు, ఎందుకంటే లౌకిక వాదం ఉంది కాబట్టి' అని మోడీ అన్నారు.

'భాష మూలంగా భారత లౌకికవాదం నాశనం కాదు'
ఒక భాష కానీ, మరేదో కానీ భారతదేశంలో లౌకిక వాదాన్ని నాశనం చేయలేవని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇటీవల దేశంలోని 500 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో మూడవ భాషగా జర్మనీ భాషకు బదులుగా సంస్కృత భాషను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

'భాష మూలంగా భారత లౌకికవాదం నాశనం కాదు'
దీనిపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది. విమర్శకులకు సమాధానంగా ఆయన బెర్లిన్‌లో సంస్కృతం ప్రస్తావన తీసుకువచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

'భాష మూలంగా భారత లౌకికవాదం నాశనం కాదు'
ఈ విషయంపై జర్మనీ వైస్ చాన్సలర్, ఆ దేశ ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి సిగ్మార్ గేబ్రియల్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇరు దేశాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.

'భాష మూలంగా భారత లౌకికవాదం నాశనం కాదు'
ప్రధాని మోడీ లౌకిక వాదం గురించి ప్రత్యేకించి మాట్లడానికి గల కారణం గత కొన్ని నెలలుగా ఢిల్లీలో క్రిస్టియన్ మతానికి చెందిన బిల్డింగులు, చర్చిలపై దాడులకు జరగడమేనని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

'భాష మూలంగా భారత లౌకికవాదం నాశనం కాదు'
హనోవర్ పర్యటన ముగించుకొని బెర్లిన్‌కు వచ్చిన ప్రధాని మోడీకి బెర్లిన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని మోడీ బస చేసిన హోటల్‌కు వందల మంది చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు.

'భాష మూలంగా భారత లౌకికవాదం నాశనం కాదు'
ఈ సందర్భంగా మోడీ కారు దిగి నేరుగా ప్రవాస భారతీయుల వద్దకు వెళ్లారు. వారితో కరచాలనం చేశారు. కొంతమందికి ఆటోగ్రఫ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications