వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదిర్ చీకటి రోజులను మరిచారు .. ఎమర్జెన్సీపై ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఎమర్జెన్సీ సమయం దేశంలో చీకటి రోజులని గుర్తుచేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేసిన తుగ్లక్ చర్య అత్యవసర పరిస్థితి అని విమర్శించారు మోడీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ .. విపక్షాలపై ఒంటికాలిపై లేచారు. ఎమర్జెన్సీ అంటే ఆత్మహత్యసదృశమని వివరించారు.

చీకటి రోజులే ..
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు మగ్గిపోయారు. ఈ సమయంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని .. వ్యవస్థలు స్తంభించిపోయాయని గుర్తుచేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 44 ఏళ్లు అయ్యింది. అయినా అప్పటి చేదు ఘటనలు కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పనులు చేపట్టిందని ఆ పార్టీ పక్స నేత అదిర్ రంజన్ చౌదరి నిన్న ప్రసంగించిన సంగతి తెలిసిందే.

Indias soul was crushed to stay in power: PM Modi reminds Congress of Emergency

దీనికి మోడీ ప్రతిస్పందించారు. సోమవారం రోజున చౌదరి తన ప్రసంగంలో ఎమర్జెన్సీ మరచిపోయారని గుర్తుచేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిందెవరు ? రాజ్యాంగాన్ని ఎవరు భ్రష్టు పట్టించారు ? మీడియాను, న్యాయ వ్యవస్థలను నియంత్రించింది ఎవరు ? ఆ చీకటి రోజులనే మేం ఎప్పటికీ మరచిపోమన్నారు ప్రధాని మోడీ.

సీటు కోసం ...
ఒకరు తమ పదవీని కాపాడుకునేందుకు దేశ ఆత్మను చూర్ణం చేశారు అప్పటి ప్రధాని ఇందిరా అని విమర్శించారు మోడీ. దీంతో మీడియా అరచి నిజాలు చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అలాగే నేతలను రహస్య ప్రదేశాలకు తరలించారని గుర్తుచేశారు. ఎమర్జెన్నీ రెండేళ్లలో జరిగిన అరాచకాలు, అన్యాయాలను ప్రజలకు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ఆనాటి చీకటి రోజులు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇంతటీ కీలకమైన అంశాన్ని మరచిపోయి .. మా హయాంలో అదీ చేశాం, ఇదీ చేశామని జబ్బలు చరుచుకుంటున్నారని దుయ్యబట్టారు.

English summary
prime Minister Narendra Modi on Tuesday evoked the memories of the Emergency in the Lok Sabha. He said that those responsible for the Emergency will never be absolved of their sins. Reminding the Congress of the Emergency, PM Modi said it was a blot on democracy that will never fade. PM Modi's first address to Parliament after being voted to power came on the 44th anniversary of the Emergency declared by then prime minister Indira Gandhi in 1975. He was replying to Congress leader Adhir Ranjan Chowdhury's comments the previous day, where the Congress MP had listed out the many achievements of Congress over the years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X