ఐరాసకు ఫిర్యాదు చేసిన పాక్: దేవుడా మీరే దిక్కు

వాషింగ్టన్: భారత్ ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ తో పాకిస్థాన్ భూభాగం (పాక్ అక్రమిత కాశ్మీర్)లోకి ప్రవేశించి పాక్ దిమ్మతిరిగేలా చేసింది. ఈ దెబ్బతో ఆత్మరక్షణలో పడిన పాకిస్థాన్ దేవుడా మీరే దిక్కు అంటూ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది.

ఆత్మరక్షణలో పడిన పాకిస్థాన్ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. శుక్రవారం పాక్ రాయబారి మహీలా లోధి యూఎన్ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ను కలిసి పరిస్థితిని వివరించారు. ఇదే సమయంలో భారత్ మీద ఫిర్యాదు చేశారు.

భారత్ మా భూభాగంలోకి అక్రమంగా చొరబడి దాడులు చేసిందని బాన్ కీ మూన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ ఎస్ సీ) అధ్యక్షుడిగా ఉన్న న్యూజిలాండ్ అంబాసిడర్ గేరార్డ్ వాన్ బోహెమన్ కు పాక్ ఫిర్యాదు చేశారు.

Pakistani UN Ambassador Maleeha Lodhi

అనంతరం పాక్ అంబాసిడర్ మహీలా లోధి మీడియాతో మాట్లాడారు. భారత్ జరిపిన దాడిలో పాక్ సైనికులు సైతం మరణించారని ఆరోపించారు. భారత్ మా సహనాన్ని పరీక్షిస్తుందని అన్నారు.

నియంత్రణ రేఖ వెంబడి మా సైన్యాన్ని అప్రమత్తం చేశామని వివరించారు. భారత్ చెబుతున్నట్లు ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ లాంటిదేమీ జరగలేదని మహీలా లోధి స్పష్టం చేశారు. భారత్ ఉత్తినే గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు.

రెండు గ్రూప్ ల మధ్య కాల్పులు మాత్రమే జరిగాయని, ఆ దాడిలో ఎనిమిది మంది భారత సైనికులు మరణించారని అన్నారు. మహారాష్ట్రకు చెందిన చందు బాబులాల్ (22)ను తాము బంధీగా పట్టుకున్నామని పాక్ అంబాసిడర్ మహీలా లోధి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+