అలాంటి ఘటనలు దేశ లౌకిక ప్రతిష్టను దిగజార్చుతున్నాయి..: బీజేపీపై ఖర్గే ఘాటు విమర్శలు

హైదరాబాద్: బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. స్థానికంగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు.. భారత ప్రగతిశీల, లౌకిక ప్రతిష్టను దిగజార్చుతున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అగ్నికి ఆజ్యం పోస్తోందని ఖర్గే ఆరోపించారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) సమావేశాల్లో భాగంగా ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు.

అణగారిన వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి, ఆహార భద్రతను పదిలపరిచేందుకు కుల గణనతోపాటు జనాభా లెక్కల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. దేశం ప్రస్తుతం అనేక తీవ్ర అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పెరుగుతోన్న నిత్యావసరాల ధరలు, విస్తరిస్తున్న అసమానతలు, రైతులు, కార్మికుల జీవితాల్లో క్షీణిస్తోన్న పరిస్థితులను నియంత్రించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

Mallikarjun

చైనా ఆక్రమణల విషయంలోనిర్లక్ష్యం దేశ భద్రతకు ముప్పు కలిగిస్తుందన్నారు ఖర్గే. మణిపూర్‌లో జరుగుతోన్న విషాదకర ఘటనలను యావత్ దేశం గమనిస్తోందన్నారు. అక్కడి మంటలు హర్యానాలోని నూహ్‌కు పాకేందుకు మోడీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు ఆధునిక, ప్రగతిశీల, లౌకిక భారత ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ, మతతత్వ సంస్థలు, మీడియాలోని ఓ వర్గం అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని ఖర్గే ఆరోపించారు.

దేశంలోని సమస్యలపై ఇండియా కూటమికి చెందిన 27 పార్టీలు ఏకతాటిపై ఉన్నాయని ఖర్గే స్పష్టం చేశారు. మూడు విజయవంతమైన సమావేశాల అనంతరం ప్రతిపక్ష కూటమి.. ప్రజా, ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు సాగుతోందని చెప్పుకొచ్చారు. దీంతో కలత చెందిన బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఖర్గే ఆరోపించారు.

త్వరలో జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. అధికార పార్టీ ఉద్దేశాల విషయంలో ఆందోళనలు రేకెస్తున్నాయని వ్యాఖ్యానించారు మల్లికార్జున్ ఖర్గే. కాగా, హైదరాబాద్ వేదికగా శనివారం సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోనియా, రాహుల్, సహా ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై కీలకంగా చర్చిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+