కరోనా డేంజర్ బెల్స్ : స్పెయిన్,ఇటలీలను దాటి ఐదో స్థానంలో భారత్..
భారత్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో ఐదు,ఆరు స్థానాల్లో ఉన్న స్పెయిన్,ఇటలీలను సైతం దాటేసి తాజాగా భారత్ ఐదో స్థానానికి చేరుకుంది. ఆదివారం(జూన్ 7) ఒక్కరోజే 9887 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. తాజా కేసులతో భారత్‌లో కేసుల సంఖ్య 2,54,354కి చేరింది. స్పెయిన్‌లో ప్రస్తుతం 241,550 పాజిటివ్ కేసులు ఉండగా.. ఇటలీలో 2,34,801 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకూ 294 మంది మృతి..
భారత్‌లో ఆదివారం ఒక్కరోజే 294 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 6,642కి చేరుకుంది. మృతుల్లో 70శాతానికి పైగా ఇతర వ్యాధులతో బాధుపడుతున్నవారే ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే కరోనా రికవరీ రేటు కూడా బాగానే ఉందని.. ఇప్పటివరకూ 48.20శాతం మంది కరోనా రోగులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

చైనాను దాటేసిన మహారాష్ట్ర
కేసుల సంఖ్యలో దేశంలోనే టాప్‌లో ఉన్న మహారాష్ట్ర తాజాగా చైనాను కూడా దాటేసింది. ఆదివారం నాటికి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 85,975కు చేరింది. అటు చైనాలో కరోనా కేసుల సంఖ్య 83.036గా ఉంది. ఇప్పటివరకూ కరోనాతో దేశవ్యాప్తంగా 6929 మంది మృత్యువాత పడగా.. ఒక్క మహారాష్ట్రలోనే 3వేల మంది మృత్యువాతపడ్డారు.
Recommended Video

అన్‌లాక్ దశలో విజృంభిస్తున్న కరోనా..
భారత్‌లో లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చినప్పటికీ.. అన్‌లాక్ చేసే క్రమంలో ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారి ఒకరు పేర్కొన్నారు. అలాంటప్పుడు కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి కేవలం మూడు వారాల సమయమే పట్టే అవకాశం ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటిక్ డైరెక్టర్ మైకేల్ రయాన్ అంచనా వేశారు. నగరాల్లో అత్యధిక జనసాంద్రత,భారీ వలసలు,పనిచేస్తే తప్ప తిండి దొరకని పరిస్థితులు వైరస్ నియంత్రణలో సవాళ్లుగా మారుతాయని అభిప్రాయపడ్డారు.
-
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications