నవంబర్ నుంచి విదేశీ పర్యాటకులకు అనుమతి, అక్టోబర్ 15 నుంచే వారికి: కేంద్రం

న్యూఢిల్లీ: కరనావైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పర్యాటకులకు విధించిన కొవిడ్‌ నిబంధనలు ఎత్తివేసి వారికి పర్యాటక వీసాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. భారత్‌ను సందర్శించాలనుకునే విదేశీయులకు నవంబర్ 15 నుంచి తాజాగా పర్యాటక వీసాలను మంజూరు చేస్తామని వెల్లడించింది.

అయితే, ఛార్టర్డ్ విమానాల్లో వచ్చే వారికి అక్టోబర్ 15 నుంచే వీసాల మంజూరు ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తితో విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గతేడాది మంజూరు చేసిన వీసాలను నిలిపివేశాం. అంతర్జాతీయ ప్రయాణాలతో కొవిడ్‌ మరింత విజృంభిస్తుందనే ఉద్దేశంతో ప్రయాణ ఆంక్షలు విధించాం. ప్రస్తుతం కొవిడ్‌ కొంత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విదేశీయులు భారతదేశానికి రావడానికి పర్యాటక వీసాలనే కాకుండా ఇతర భారతీయ వీసాలను మంజూరు చేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో పేర్కొంది. దీనిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతే ప్రయాణ ఆంక్షలను సడలించాలని నిర్ణయించినట్లు హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కరోనా నిబంధనలను విదేశీ పర్యాటకులు తప్పక పాటించేలా మార్గదర్శకాలు ఉండాలని రాష్ట్రాలు కోరాయని సదరు అధికారి తెలిపారు.

 India to re-open for foreign tourists from November 15, October 15 For Those On Chartered Flights

ఇది ఇలావుండగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నప్పటికీ చాలా దేశాలు ఇప్పటికీ టీకా కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలతో పాటు ఇతర దేశాలను ఆదుకునేందుకు భారత్‌ మరోసారి ముందుకువచ్చింది. వ్యాక్సిన్‌ మైత్రిలో భాగంగా ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసేందుకు తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఈ క్రమంలో నేపాల్‌, మయన్మార్‌, బంగ్లాదేశ్‌లకు 10లక్షల డోసుల చొప్పున కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అందజేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్ఐఐ)కు అనుమతించింది. మరో ప్రముఖ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ 10లక్షల డోసులను ఇరాన్‌కు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. వీటితో పాటు పెద్ద మొత్తంలో కొవిషీల్డ్‌ను ఎగుమతి చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా దాదాపు 3కోట్ల డోసులకు సమానమైన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ బ్రిటన్‌కు సరఫరా చేయనుంది. దీనికి సంబంధించి యూకేతో ఒప్పందం కుదుర్చుకున్న దృష్ట్యా.. వ్యాక్సిన్‌ సరఫరాకు అనుమతివ్వాలని కోరుతూ సీరం ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ (ప్రభుత్వ, నియంత్రణ సంస్థల వ్యవహారాల విభాగం) ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.

కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్‌ కార్యక్రమంలో భాగంగా ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ డోసులను భారత్‌ ఉచితంగానే అందించింది. వీటితోపాటే ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం తయారీ సంస్థలు ఎగుమతి ప్రారంభించాయి. అయితే, దేశంలో సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి పెరగడంతోపాటు వ్యాక్సిన్‌ కొరత కారణంగా విదేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతి, సరఫరా చేసే కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.

Recommended Video

    Prabhas Supremacy.. ఈ ఆధిపత్యం అనితర సాధ్యం | Prabhas 25 | Spirit || Oneindia Telugu

    గడిచిన రెండు నెలలుగా దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసే కొవిషీల్డ్‌ డోసుల ఉత్పత్తి నెలకు 20కోట్లకు చేరింది. మరోవైపు భారత్‌ బయోటెక్‌ కూడా నెలకు 3 కోట్ల కొవాగ్జిన్‌ డోసులను ఉత్పత్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక అవసరాలకు సరిపోగ మిగిలిన వ్యాక్సిన్‌ డోసులను 'వ్యాక్సిన్‌ మైత్రి'లో భాగంగా ఇతర దేశాలకు సరఫరా చేస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభినందించింది కూడా. కరోనా కష్టకాలంలో భారత్ నిర్ణయం ఎంతో గొప్పదని కొనియాడింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+