వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

India Today MoTN poll: దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ బీజేపీనే, కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భార‌తదేశంలో ఇప్ప‌టికిప్పుడు సాధార‌ణ ఎన్నిక‌లు వ‌స్తే గెలుపెవ‌రిది? మ‌ళ్లీ ప్ర‌జ‌లు ఎవ‌రి ప‌ట్టం క‌డ‌తారు? ఎన్డీఏకు వ‌చ్చే సీట్లు ఎన్ని? యూపీఏ గెలుచుకోబోతోన్న స్థానాలెన్ని? లాంటి ఆసక్తిరమైన అంశాల‌పై స‌ర్వే ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టుడే. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట జ‌రిగిన ఈ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌పెట్టింది.

ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి 296 సీట్లు

ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే ఎన్డీఏకి 296 సీట్లు

ఇప్పటికిప్పుడు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే.. మ‌రోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఆ సర్వే తేల్చేసింది. 543 స్థానాలున్న లోక్‌సభకు ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 296 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని, ఇక కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ 127 స్థానాలో స‌రిపెట్టుకుంటుంద‌ని స్పష్టం చేసింది.

ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే బీజేపీకి 271 సీట్లు

ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు జరిగితే బీజేపీకి 271 సీట్లు

ఇక, ఇతరుల 120 స్థానాలు ద‌క్కించుకుంటార‌ని వెల్ల‌డించింది. ఇక‌, పార్టీల వారీగా చూస్తే.. అత్య‌ధికంగా బీజేపీయే 271 స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని, కాంగ్రెస్ పార్టీ 62 సీట్ల‌కే ప‌రిమితం అవుతుంద‌ని, ఇతరులకు 210 స్థానాల్లో విజ‌యం సాధిస్తార‌ని పేర్కొంది. మరోవైపు, వచ్చే నెల నుంచి ఐదు రాష్ట్రాలు.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఈ స‌ర్వే ఫ‌లితాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇక‌, పెద్ద రాష్ట్రాల్లో ఇప్ప‌టికిప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగితే.. రాజస్థాన్‌లో ఎన్డీఏ 24 సీట్లు గెలుచుకుంటుంది.. గుజరాత్‌లో ఎన్డీఏ 25 సీట్లు కైవ‌సం చేసుకుంటుంది.. మహారాష్ట్రలో యూపీఏ 32 సీట్లలో విజ‌యం సాధిస్తుంది.. కర్ణాటకలో ఎన్డీఏ 17 సీట్లు, యూపీఏ 10 సీట్లు గెలుచుకుంటాయ‌ని.. మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వే ఫ‌లితాలు చెబుతున్నాయి.

పంజాబ్ మినహా పోల్‌బౌండ్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ రేటింగ్ ఉత్తమం

పంజాబ్ మినహా పోల్‌బౌండ్ రాష్ట్రాల్లో ప్రధాని మోడీ రేటింగ్ ఉత్తమం

ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్‌లో.. ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ మినహా అన్ని పోల్‌బౌండ్ రాష్ట్రాలలో అత్యుత్తమ పనితీరు రేటింగ్‌లను పొందారు. నాలుగు ఎన్నికలకు పరిమితమైన రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్‌లో ప్రధాని మోడీ పనితీరు -- 50 శాతం, అంతకంటే ఎక్కువ స్కోర్‌లను సాధించాయని మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సూచించింది. కాగా, ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రతిబింబించే సంఖ్యలు పార్లమెంటరీ నియోజకవర్గాలకు అనుగుణంగా ఉంటాయి. సర్వే ఫలితాలు ఐదు ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సూచించాల్సిన అవసరం లేదు. కాగా, మూడ్ ఆఫ్ ది నేషన్ అనేది ఇండియా టుడే గ్రూప్ ద్వారా నిర్వహించబడే ద్వై-వార్షిక దేశవ్యాప్త సర్వే. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు సాధారణంగా ప్రతి జనవరి, ఆగస్టులలో విడుదల చేయబడతాయి. మూడ్ ఆఫ్ ది నేషన్ అంటే ఏమిటి? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అనేది అత్యంత ముఖ్యమైన సమస్యలపై ప్రజల అభిప్రాయానికి అత్యంత ఖచ్చితమైన ప్రతిబింబంగా చెప్పవచ్చు. .ఒక దశాబ్దానికి పైగా, ఈ సర్వే రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సమాజం, క్రీడలు, సినిమా, విదేశీ వ్యవహారాలపై మారుతున్న జాతీయ కథనాలను వివరిస్తోంది.

English summary
India Today Mood of the Nation poll: BJP-led NDA may win 296 seats if Lok Sabha election is held today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X