ఇండియాటీవీ ఓపినియన్ పోల్: గుజరాత్‌లో బీజేపీదే హవా, కాంగ్రెస్ పోటీ ఇస్తుంది!

Subscribe to Oneindia Telugu

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా టీవీ-వీఎంఆర్ ఓపినియన్ పోల్ విడుదల చేసింది. డిసెంబర్ 9న తొలిదశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

కాగా, గత 22ఏళ్ల నుంచి అధికారాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్న భారతీయ జనతా పార్టీ.. ఈ ఎన్నికల్లోనూ అనూహ్య విజయం సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది.

 నవంబర్ 23-నవంబర్ 30మధ్య ఈ తాజా సర్వే ప్రకారం..

నవంబర్ 23-నవంబర్ 30మధ్య ఈ తాజా సర్వే ప్రకారం..

మొత్తం 182 అసెంబ్లీ సీట్లలో..
బీజేపీ-106-116 సీట్లలో విజయం సాధిస్తుంది.
కాగా, కాంగ్రెస్ మాత్రం 63-72సీట్లకే పరిమితం కానుంది.

కీలకమైన మూడు ప్రాంతాల్లో..

కీలకమైన మూడు ప్రాంతాల్లో..

దక్షిణ గుజరాత్(35సీట్లు)

బీజేపీ: 23-27 గెలుచుకునే అవకాశం ఉంది.
కాంగ్రెస్ 6-10 గెలుచుకునే అవకాశం ఉంది.

ఇక ఉత్తర గుజరాత్ విషయానికొస్తే..
బీజేపీ మొత్తం 53 సీట్లలో 30-34సీట్లను చేజిక్కుంచుకునే అవకాశం ఉంది.
కాగా, కాంగ్రెస్ పార్టీ 18-22సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది.

సౌరాష్ట్ర-కచ్ ప్రాంతం(54సీట్లు)
బీజేపీ: 27-31
కాంగ్రెస్: 23-27

సెంట్రల్ గుజరాత్(40సీట్లు)
బీజేపీ: 23-27
కాంగ్రెస్: 13-17

గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది?

గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది?

బీజేపీ: ప్రస్తుత సీఎం విజయ్ రూపానికి 36శాతం

ఆనంద్ బెన్ పటేల్: 07శాతం
శంకర్ సింగ్ వాఘేలా: 05శాతం

ఏ కులం ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది?
ఎస్సీ: 43శాతం బీజేపీకి, 45శాతం కాంగ్రెస్ పార్టీకి, 12శాతం ఇతరులకు

ఎస్టీ: 47శాతం బీజేపీ, 39శాతం కాంగ్రెస్ పార్టీకి, 14శాతం ఇతరులకు

అప్పర్ క్యాస్ట్: 51శాతం బీజేపీకి, 31శాతం కాంగ్రెస్ పార్టీకి, 18శాతం ఇతరులకు

ప్రభావం ఎలాగుందంటే..

ప్రభావం ఎలాగుందంటే..

రాహుల్ గాంధీ ఆలయాల సందర్శన ప్రభావం

ఏ ప్రభావం ఉండదు: 45శాతం
లాభం ఉంటుంది: 55శాతం

పాటిదార్, ఓబీసీలు, దళితులు కాంగ్రెస్ పార్టీకి ఓటెస్తారా?
వీరి నుంచి లాభం పొందవచ్చు: 47శాతం
ఈ 3కమ్యూనిటీలు కలిసి మద్దతివ్వవు: 9శాతం
బీజేపీ బలంగా ఉంది: 34శాతం

హార్ధిక్ పటేల్ సెక్స్ సీడీల వివాదం ప్రభావం:
ఏ ప్రభావం ఉండదు: 60శాతం
హార్ధిక్ పటేల్ పై అసంతృప్తి: 24శాతం
హార్దిక్ పటేల్ పై సానుభూతి పెరిగింది: 16శాతం

రాహుల్ ప్రభావం ఎంత?

రాహుల్ ప్రభావం ఎంత?

రాహుల్ ప్రచారం కాంగ్రెస్ పార్టీకి కలిసోస్తుందా?

ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది: 37శాతం
ఏం లాభం లేదు, మార్పు ఉండదు: 39శాతం
సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే లాభం ఉంటుంది: 24శాతం

కాంగ్రెస్-హార్ధిక్ పటేల్ డీల్ ఏంటి?

కాంగ్రెస్ ట్రాప్ లో హార్ధిక్ పడ్డారు: 26శాతం
హార్ధిక్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు: 16శాతం
హార్దిక్ కాంగ్రెస్ పార్టీలో చేరాలి: 22శాతం

ఇప్పటికే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఇటు ప్రధాని నరేంద్ర మోడీ, అటు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా, ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురుకావడం ప్రాధాన్యాంశంగా మారింది.

న్యూస్ నేషన్ గ్రౌండ్ జీరో పోల్ సర్వే ప్రకారం..

న్యూస్ నేషన్ గ్రౌండ్ జీరో పోల్ సర్వే ప్రకారం..

గుజరాల్ అసెంబ్లీ ఎన్నికల్లో..

బీజేపీ: 131-141: (136)
కాంగ్రెస్: 37-47: (42)
ఇతరులు: 2-6: (4)

ఓటు శాతం ఎలా ఉండబోతోందంటే..:
బీజేపీ: 49శాతం
కాంగ్రెస్: 37శాతం
ఇతరులు: 14శాతం

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The political fervour is gaining pace in Gujarat ahead of the state Assembly elections, with the polling for the first phase to take place on December 9.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి