శత్రుదుర్భేద్యంగా భారత్..! వచ్చే 15 ఏళ్లకు కేంద్రం బిగ్ ప్లాన్ ఇదే..!
ఈ ఏడాది కాశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కన్నా జరిగిన తీరే దేశ ప్రజల్ని ఎక్కువగా కలవరపెట్టింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపక తప్పక పరిస్ధితులు కేంద్రానికి తలెత్తాయి. అప్పటివరకూ తీసుకుంటున్న చర్యల వల్ల ఏమాత్రం ఫలితం లేదని అర్ధం చేసుకున్న కేంద్రం.. ఆపరేషన్ సింధూర్ రూపంలో మెరుపుదాడికి దిగింది. అతి తక్కువ సమయంలోనే పొరుగుదేశంలో ఉగ్రవాద శిబిరాల్ని మట్టుబెట్టి వచ్చింది. దీని తర్వాత దేశాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు రక్షణ సంపత్తిని ఆధునీకీకరించుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది.
ఈ నేపథ్యంలో కేంద్రం వచ్చే 15 ఏళ్ల టార్గెట్ గా రక్షణ రంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసింది. ఈ రూట్ మ్యాప్ ప్రకారం ప్రస్తుతం వాడుతున్న రక్షణ సామాగ్రిని అప్ గ్రేడ్ చేసుకోవడంతో పాటు అత్యాధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లు, అణు యుద్ధ నౌకల్ని సిద్ధం చేసుకోవడం, లేజర్ వ్యవస్థలు, ఏఐ ఆయుధాలు కూడా కొనుగోలు చేయడం వంటివి ఉన్నాయి. వీటిని తక్కువ సమయంలో సమకూర్చుకోవడం ద్వారా రక్షణ రంగాన్ని పటిష్టం చేసుకోవడం కేంద్రం లక్ష్యంగా ఉంది.

తాజా రూట్ మ్యాప్ ప్రకారం టీ72 విమానాల స్థానంలో దాదాపు 1,800 భవిష్యత్ ట్యాంకులను, పర్వత యుద్ధానికి 400 తేలికపాటి ట్యాంకులను, 50,000 ట్యాంక్-మౌంటెడ్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను , 700కి పైగా రోబోటిక్ కౌంటర్-ఐఈడీ వ్యవస్థలను సైన్యం ప్రవేశపెట్టనుంది. నౌకాదళానికి కొత్త విమాన వాహక నౌక, 10 నెక్ట్స్ జనరేషన్ యుద్ధనౌకలు, 7 అధునాతన కార్వెట్‌లు , 4 ల్యాండింగ్ డాక్ ప్లాట్‌ఫారమ్‌లు లభిస్తాయి. యుద్ధనౌకల కోసం అణు చోదకం, అలాగే విద్యుదయస్కాంత విమాన ప్రయోగ వ్యవస్థలను కూడా సమకూర్చుకుంటారు.

అలాగే ఎయిర్ ఫోర్స్ 75 హై-ఎలిట్యూడ్ సూడో-శాటిలైట్‌లు, 150 స్టెల్త్ బాంబర్ డ్రోన్‌లు, వందలాది ప్రెసిషన్-గైడెడ్ మందుగుండు సామగ్రి , 100కి పైగా రిమోట్ పైలట్ విమానాలను కొనుగోలు చేస్తుంది.అటు ఏఐలో స్వయంప్రతిపత్తి , అంతరిక్ష యుద్ధానికి సన్నద్ధం చేయనుంది. అలాగే 21వ శతాబ్దపు ముప్పులకు భారతదేశ సమాధానం కూడా అవుతుంది. కాబట్టి పొరుగుదేశాలు ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇవి హెచ్చరించేలా ఉన్నాయి. ఈ భారీ రక్షణ బలోపేతం ప్రణాళిక, భారతదేశం ఉగ్రవాదంపై తన యుద్ధాన్ని ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉందని మరియు ఏదైనా అత్యవసర పరిస్థితికి తనను తాను బలపరుచుకుంటుందనే సంకేతాలు ఇస్తోంది.












Click it and Unblock the Notifications