పాక్‌లో ప్రళయం సృష్టించిన భారత్ క్షిపణులు ఇవే - అంతా క్షణాల్లోనే..!!

భారత్ సైన్యం పాక్ కు కాళరాత్రిని మిగిల్చింది. పాక్ - పీఓకే లో ఉన్న ఉగ్రవాద శిబిరాల పైన విరుచుకు పడింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాద క్యాంపులతో పాటుగా.. ఉగ్రవాదులను మట్టు బెట్టింది. కేవలం 23 నిమిషాల్లో భారత్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పూర్తి చేసింది. పాకిస్థాన్ వీటికి ప్రతిగా ధీటైన సమాధానం ఇస్తామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. పాక్ దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. భారత సైన్యం అప్రమత్తంగా ఉంది. అటు రాష్ట్రపతిలో ప్రధాని భేటీ అయ్యారు. ఇక, ఆపరేషన్ సింధూర్ లో వినియోగించిన అస్త్రాలపైన ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రళయ గర్జన
ఆపరేషన్ సింధూర్ తొమ్మది ప్రాంతాల్లో జరిగింది. 23 నిమిషాల వ్యవధిలో పక్కా ప్లాన్ ప్రకారం ఉగ్రవాద శిబిరాల పైన మెరుపు దాడులు చేసారు. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టారు. ఈ మెరుపు దాడుల పైన భారత్ లోని అన్ని రాజకీయ పార్టీలు.. ముఖ్యులు సైన్యానికి మద్దతుగా నిలుస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గం సమావేశంలో మెరుపు దాడుల గురించి మంత్రులకు ప్రధాని వివరించారు. అటు రాష్ట్రపతితో ప్రధాని భేటీ అయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగు తున్నాయి. పారా మిలిటరీ సిబ్బందికి సెలవులు రద్దు చేసారు. ఇక, ఆపరేషన్ సింధూర్ లో నిమిషాల వ్యవధిలో నిర్దేశిత లక్ష్యాలను నేల మట్టం చేసిన క్షిపణులు ఆసక్తి కరంగా మారాయి. సైన్యం అమ్ముల పొదిలో నిక్షిప్తమైన ఈ అస్త్రాలు ఇప్పుడు పాక్ లో ప్రళయ గర్జన చేసాయి.

india-used-hammer-and-scalp-to-hit-terror-camps-in-operation-sindoor

క్షిపణులు - బాంబులు
ఆపరేషన్ సింధూర్ లో స్కాల్ప్‌ క్షిపణులు, హ్యామర్‌ బాంబులను వాడినట్లు ప్రాథమిక సమాచారం. నిజానికి ఇలాంటి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడారన్నది దళాలు ఎప్పడూ కూడా బహిర్గతం చేయవు. కానీ, అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా నిపుణులు ఓ అంచనా కు వస్తుంటారు. తాజా ఆపరేషన్ లో ఆత్మాహుతి డ్రోన్లను విస్తృతంగా వినియోగించినట్లు తెలుస్తోం ది. అవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని విరుచుకుపడతాయి. లక్ష్యాలను కచ్చితంగా అనుకు న్నట్లు గుర్తిస్తాయి. వాటిలో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. అలాంటి డ్రోన్స్ భారత్​ దగ్గర చాలానే ఉన్నాయి. స్కాల్ప్‌ క్షిపణులను స్ట్రామ్‌ షాడో అని కూడా పిలుస్తుంటారు. ఫ్రాన్స్‌ అభివృద్ధి చేసిన వాటికి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంటుంది.

లక్ష్యాలపై గురి పెట్టి
స్కాల్ప్ క్షిపణులను అందుకే వాటిని శత్రుదేశాల్లోకి చొచ్చుకెళ్లి దాడి చేసేందుకు ఉపయోగిస్తుం టారు. యుద్ధ విమానాలపై నుంచి కూడా కొన్ని ప్రయోగిస్తుంటారు. హ్యామర్ బాంబులను ధృడంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు వినియోగిస్తారు. స్మార్ట్‌ బాంబ్‌ కోవలోకి వచ్చే వాటిని లక్ష్యానికి 50-70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు. ఎంత ఎత్తు నుంచి ప్రయోగించిన విషయంపై దాని సత్తా ఆధారపడి ఉంటుంది. అలా ఈ మూడు రకాల అత్యాధునిక ఆయుధాలను వాడి 23 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేసారు. ఈ దాడుల సమయంలో బవహల్పూర్‌, మురిద్కేలను ధ్వంసం చేసే బాధ్యత వాయుసేన పూర్తి చేసింది. కాగా, నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన పీ8ఐ విమానాలు, ఎంక్యూ9 డ్రోన్లతో సహకారం అందిం చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+