Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్.. అడుక్కు తినే దేశం- బీజేపీని విమర్శిస్తే స్వర్గంలో నో ఎంట్రీ: నరకమే గతి: కటీల్ కాంట్రవర్సీ..!!

బీజేపీ కర్ణాటక రాష్ట్రశాఖ అధ్యక్షుడు, దక్షిణ కన్నడ లోక్ సభ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ను ఆయన బిచ్చగాళ్ల దేశంగా అభివర్ణించారు.

బెంగళూరు: భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్రశాఖ అధ్యక్షుడు, దక్షిణ కన్నడ లోక్ సభ సభ్యుడు నళిన్ కుమార్ కటీల్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ను ఆయన బిచ్చగాళ్ల దేశంగా అభివర్ణించారు. అప్పుల్లో కూరుకునిపోయి ఉందని వ్యాఖ్యానించారు. తమ పార్టీని విమర్శించిన వారికి స్వర్గంలో చోటు దక్కదని, నరకంలో పడతారంటూ శపించారు. 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాన్ని దోచుకుని తిన్నారంటూ మండిపడ్డారు.

Nalin Kumar Kateel

ఇవ్వాళ ఆయన కొడగు జిల్లాలోని విరాజ్ పేటెలో పర్యటించారు. బిట్టంగాళలోని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో ఓ అడుగు ముందుకేశారు. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిందని, దేశాన్ని అడుక్కు తినేలా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ వల్ల దేశం అప్పుల్లో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు.

Nalin Kumar Kateel

కాంగ్రెస్‌ నాయకులకు స్వర్గంలో చోటు దక్కదని, నరకంలో పడాల్సిందేనని కటీల్ శపించారు. 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ నాయకులు దేశాన్ని దోచుకున్నంతగా ఎవరూ చేయలేదని ధ్వజమెత్తారు. సోనియా గాంధీ ఎందుకు బెయిల్‌ పై ఉన్నారని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ తీహార్ జైలుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ డీకే శివకుమార్ తీహార్ జైలుకు వెళ్లారా? అని ఎద్దేవా చేశారు.

కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడం, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలను స్వీకరించిన తరువాత వ్యవస్థలన్నీ సవ్యంగా సాగుతున్నాయని ప్రశంసించారు. కాంగ్రెస్ చేసిన తప్పులను మోదీ సరిదిద్దుతున్నాడని, దేశానికి పట్టిన కళంకాన్ని తుడిచి వేసే పనిలో మోదీ ఉన్నారని చెప్పుకొచ్చారు కటీల్.

Nalin Kumar Kateel

స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ సరైన దిశగా అభివృద్ధి పనులు చేసి ఉంటే భారత్ ఇలా బిచ్చగాళ్ల దేశంగా మారి ఉండేది కాదని కటీల్ విమర్శించారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై 40 శాతం కమీషన్‌ ఇస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఇన్‌ ఛార్జ్ రణ్‌ దీప్‌ సింగ్‌ సూర్జేవాలా చేసిన ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. సిద్ధరామయ్య ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని ధ్వజమెత్తారు. బొమ్మై అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడుతుండగా కాంగ్రెస్ నాయకులు చెవిలో పువ్వులు పెట్టుకున్నారని, ఇది నిండు సభను అవమానించినట్టేనని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+