2019లో బీజేపీ గెలిస్తే భారత్ 'హిందూ పాకిస్తాన్' అవుతుంది: శశిథరూర్
Recommended Video

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019లో మళ్లీ బీజేపీయే గెలిస్తే భారత్ హిందూ పాకిస్తాన్ అవుతుందని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్‌లో ఇతర హిందువులను, క్రైస్తవులను, సిక్కులను ఎలా చూస్తారో తెలిసిందే.
భారత్‌లో బీజేపీ మళ్లీ గెలిస్తే అలాగే అయ్యే పరిస్థితులు తలెత్తుతాయని థరూర్ అన్నారు. ఒకవేళ లోకసభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మాత్రం మన ప్రజాస్వామ్యయుత రాజ్యాంగం యథాతథంగా మనుగడ సాగించడం కష్టమని వ్యాఖ్యానించారు.

శశిథరూర్ వ్యాఖ్యలపై బీజేపీ నిప్పులు చెరిగింది. హిందూపాకిస్థాన్ అంటూ శశిథరూర్ వ్యాఖ్యానాలు చేయడం సిగ్గుచేటు అని బీజేపీ నేత సంబీత్ మహాపాత్ర ట్వీట్ చేశారు.
భారత్‌ను చిన్నగా చేసి చూపించడానికి, హిందువులను అపఖ్యాతిపాలు చేసేందుకు కాంగ్రెస్ ఇలా వెనుకాడటం లేదని మండిపడ్డారు. హిందువులను అవమానించేందుకు ఏ అవకాశం వచ్చినా కాంగ్రెస్ వదులుకోదని, దానిని సంపూర్ణంగా ఉపయోగించుకుంటుందని ఎద్దేవా చేశారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications