సరిహద్దులో తెగబడ్డ చైనా: పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని భారత్‌కు హెచ్చరిక!
భారత్-చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా 'డోకా లా' వివాదం రగులుతోంది. సిక్కీం సెక్టార్ లోని భూటాన్ భూభాగంలో చైనా నిర్మిస్తున్న రహదారి ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తమ భూభాగంలోకి తొలుత
సిక్కిం: భారత్-చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా 'డోకా లా' వివాదం రగులుతోంది. సిక్కీం సెక్టార్ లోని భూటాన్ భూభాగంలో చైనా నిర్మిస్తున్న రహదారి ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. తమ భూభాగంలోకి తొలుత భారత జవాన్లే అక్రమంగా చొచ్చుకు వచ్చి రహదారి నిర్మాణాన్ని అడ్డుకున్నారని చైనా ఆరోపిస్తోంది.
మరోవైపు చైనా సైనికులే భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి.. రెండు బంకర్లను ధ్వంసం చేశారని భారత సైన్యం ఆరోపిస్తోంది. ఇందుకు బలం చేకూర్చేలా తాజాగా చైనా దురాక్రమణపై ఓ వీడియో వెలుగుచూసింది. చైనాకు చెందిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులు.. భారత భూభాగంలోకి చొచ్చుకురావడాన్ని మన సైనికులు అడ్డుకుంటున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

చైనా మీడియా దురుసుతనం:
మొత్తం మీద సిక్కీం సరిహద్దు కేంద్రంగా చైనా-భారత సైన్యాలు ఢీ అంటే ఢీ అన్న తరహాలో వ్యవహరిస్తుండటం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఇలాంటి తరుణంలో.. వివాదాన్ని మరింత రచ్చకీడ్చేలా.. చైనా మీడియా తన దురుసుతనం బయటపెట్టుకోవడం గమనార్హం.చైనా సైన్యం చర్యలను సమర్థించుకుంటూ.. తమ సైనిక శక్తి ముందు భారత్ బలాదూరే అన్నట్లుగా అక్కడి మీడియా వ్యాఖ్యానించింది.

పరిణామాలు తీవ్రంగా ఉంటాయని:
భారత్ సైనిక ఘర్షణకు దిగితే.. 1962కన్నా ఎక్కువగా దెబ్బతింటుందని హెచ్చరించింది. ఇప్పటి ఇండియన్ ఆర్మీ.. ఒకప్పటి 1962యుద్దంలో దెబ్బతిన్న భారత సైన్యం లాంటి కాదని కేంద్రమంత్రి జైట్లీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చైనా మీడియా స్పందించింది. ఈ మాట అనేముందు.. ఇప్పటి చైనా కూడా ఒకప్పటి కంటే మరింత శక్తివంతంగా ఉందని హెచ్చరించింది.

గ్లోబల్ టైమ్స్ కథనం:
భారత్ ను హెచ్చరిస్తూ.. చైనా ప్రభుత్వ మీడియా సంస్థ 'గ్లోబల్ టైమ్స్' ప్రచురించిన ఈ కథనంలో పరుషమైన పదజాలం వాడినట్లుగా తెలుస్తోంది. డోక్ లా ప్రాంతంలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుని దాన్నో వివాదంగా మార్చడానికి భారత్ యత్నిస్తోందని చైనా మీడియా ఆరోపించింది. భారత్ ను ప్రచ్చన్న యుద్ద పిపాసి అని పేర్కొంటూ.. రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రాంతంలో సిలిగురి కారిడార్ కు భూసంబంధాలు తెగిపోతున్నాయని భారత్ ఆందోళన చెందుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఇదీ భారత్ వ్యూహం అని!
ఈశాన్య ప్రాంతాల్లోని కల్లోలాన్ని కట్టడి చేసేందుకు సిలిగురి కారిడార్ వ్యూహాత్మకంగా కీలకమని భారతీయులు అనుకుంటుండమే భారత సైన్యాన్ని ఇలాంటి చర్యలకు ఉసిగొల్పుతోందని అభిప్రాయపడింది. కాగా, భారత సైనికులు తమ భూభాగంలోకి చొచ్చుకు వస్తున్నారన్న కారణంగా.. భారతీయులు చేపట్టే మానస సరోవర యాత్రను చైనా నిలిపివేయడం గమనార్హం. గత 20రోజులుగా భారత చైనా మధ్య నలుగుతున్న ఈ వివాదం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications