వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా:భారత్‌లో రెమ్‌డెసివీర్ ట్రయల్స్.. మోదీ సర్కారే దేశాన్ని కాపాడింది.. ప్రజలదే తప్పన్న మంత్రి

|
Google Oneindia TeluguNews

భారత్‌లో కరోనా విలయం యధావిధిగా కొనసాగుతోంది. సోమవారం నాటికి కొవిడ్-19 కేసుల సంఖ్య 43వేలకు, మరణాలకు 14వందలకు చేరువయ్యాయి. ఇప్పటిదాకా ఈ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారు. వాటిలో అతి ప్రధానమైందిగా భావిస్తోన్న 'రెమ్‌డెసివీర్'వాడకానికి భారత్ సైతం సిద్ధమైంది. దీంతోపాటు వైరస్ వ్యాప్తికి గల కారణాలను వివరిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

WHO సూచనల మేరకు..

WHO సూచనల మేరకు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) సభ్యదేశంగా ఆ సంస్థ నిర్వహిస్తోన్న సాలిడారిటీ ట్రయల్స్ లో భారత్ కూడా భాగం పంచుకుంటున్నదని, ఆ క్రమంలోనే ఇక్కడి రోగులపైనా రెమ్‌డెసివీర్ డ్రగ్ ను టెస్టు చేయబోతున్నామని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ‘‘రెమ్‌డెసివీర్ ట్రయల్స్ కు సంబందించి అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. ఐసీఎంఆర్, సీఎస్ఐఆర్ సైంటిస్టులు కూడా దాదాపు ఓకే చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో నుంచి 1000 డోసుల డ్రగ్స్ అందాయి. ఎంపిక చేసుకున్న రాష్ట్రాల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులపై ఆ డ్రగ్ ను ప్రయోగిస్తాం''అని వివరించారు.

ఏంటీ రెమ్‌డెసివీర్

ఏంటీ రెమ్‌డెసివీర్

కొవిడ్-19 చికిత్సలో మొదట యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకాన్ని ప్రోత్సహించారు. అయితే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటాయని తేలడంతో డాక్టర్లు, సైంటిస్టులు రెమ్‌డెసివీర్ వైపు మొగ్గు చూపారు. కొన్నేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన ఎబోలా వైరస్ కు విరుగుడు వ్యాక్సినే ఈ రెమ్‌డెసివీర్. యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో సుమారు 1000కిపైగా క్రిటికల్ కండిషన్ లో ఉన్న కొవిడ్-19 పేషెంట్లకు రెమ్‌డెసివీర్ అందించగా, 31 శాతం మంది వేగంగా కోలుకున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన మేరకు అన్ని దేశాలు ఈ డ్రగ్ వాడకాన్ని మొదలు పెట్టాయి. భారత్ తొలిసారిగా రెమ్‌డెసివీర్ వాడబోతున్నట్లు కేంద్ర మంత్రే వెల్లడించారు.

చైనాపై చిందులు..

చైనాపై చిందులు..


ప్రపంచం గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా భారత్ తన వంతుగా బాధ్యత నిర్వహిస్తుందని, కరోనా విలయం తొలినాళ్లలో కొన్ని వందల దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, పారాసిటమాల్ మందుల సరఫరా చేశామని మంత్రి హర్ష వర్ధన్ గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ లో లోపాలు తలెత్తడం దురదృష్టకరమని, పనికిరాని కిట్స్ ను పంపిన చైనాకు ఒక్క పైసా కూడా చెల్లించబోమని ఆయన స్పష్టం చేశారు.

Recommended Video

Lockdown 3.0 : It's Pollution Time, Massive Traffic Jams On Roads In Amid Relaxations
మోదీ సర్కారే కాపాడిందంటూ..

మోదీ సర్కారే కాపాడిందంటూ..

కరోనా నియంత్రణ, లాక్ డౌన్ ఎగ్జిట్ ప్లాన్ విషయంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్రాల మధ్య విభేదాలు పొడచూస్తున్నవేళ.. క్రెడిమ్ మొత్తం మోడీ సర్కారుకే ఆపాదిస్తూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. సోమవారం పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన ఆయన.. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర వైరస్ ప్రభావం తక్కువగా ఉందని.. ముందు చూపుతో వ్యవహరించి మోదీ సర్కారే దేశాన్ని కాపాడిందని చెప్పుకున్నారు. అదేసమయంలో పాజిటివ్ కేసులు పెరగడానికి కారణం ప్రజలేనని నిందించారు. ప్రధానంగా ఢిల్లీ, ముంబై లాంటి మెగాసిటీల్లో నివసిస్తోన్న జనం.. లాక్ డౌన్ ఆదేశాలను బేఖాతరు చేస్తుండటం వల్లే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నదన్నారు.

English summary
union health minister Harsh Vardhan has said India is part of WHO solidarity trials has received 1,000 doses of Remdesivir, which will be tested on some patients across states. More Cases in mega cities People Did Not Follow Lockdown Properly, he Says
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X