పాక్‌కు సమాచారం: 'ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు నిర్వహించాం'
న్యూఢిల్లీ: యూరీ, పూంచ్‌లో చనిపోయిన ఉగ్రవాదులు వేలి ముద్రల, డీఎన్ఏ నమూనాలను పాకిస్థాన్‌కు అందేజేశామని ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) రణబీర్ సింగ్ అన్నారు. గురువారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎల్ఓసీలో మరోసారి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన పేర్కొన్నారు.
భారత్‌పై ఎలాంటి ఉగ్రదాడులను సహించబోచమని ఆయన స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని స్థావరాలపై దాడులు చేస్తామని చెప్పారు. ఉగ్రవాదులు మెట్రో నగరాలపై దాడులకు కుట్ర పన్నారని, జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇప్పటి వరకు పాక్ వైపు నుంచి 20 చొరబాట్లను అడ్డుకున్నామని అన్నారు.

యూరీ ఉగ్రదాడిపై తమ అభ్యంతరాలన్నీ పాకిస్థాన్ జనరల్‌కు వివరించామని తెలిపారు. గత రాత్రి పీఓకే ప్రాంతంలో దాడులు నిర్వహించామని పేర్కొన్నారు. పాక్ ఆర్మీ తమతో సహకరిస్తుందని ఆశించినట్లు తెలిపారు. కానీ అటువైపు నుంచి స్పందన లేదని చెప్పారు. నియంత్రణ రేఖ దాటి భారత్ భూబాగంలోకి ఉగ్రవాదులు చొరబ్డారని సమాచారంతో భారత్ సైన్యం సర్జకిల్ దాడులు జరిపిందని అన్నారు.
ఇదిలా ఉంటే పాకిస్థాన్ మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. తాజాగా గురువారం ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలోని నౌగమ్ సెక్టర్ పైకి కాల్పులు జరిపాయి. సెక్టార్‌లోని ధనిష్, లక్ష్మీ పోస్టులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి.
దీంతో వెంటనే స్పందించిన సైన్యం ఎదురు కాల్పులకు దిగింది. ఇరువైపులా కాల్పులు హోరా హోరీగా సాగుతున్నాయి. యూరీ ఉగ్రదాడి నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులపై ప్రధాని మోడీ భద్రత వ్యవాహరాల కేబినెట్ కమీటీతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పాక్ కాల్పుల ఉల్లంఘన, అక్రమ చొరబాట్లపై అధికారులతో చర్చించారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రధాని గురువారం పాక్ 'మోస్ట్ పేవరడ్ నేషన్' హోదాపై సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే కాశ్మీర్‌లోని నౌగమ్ సెక్టార్‌లో పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటంతో భద్రత వ్యవాహరాల కేబినెట్ కమిటీతో మోడీ సమావేశమయ్యారు. 'మోస్ట్ పేవరడ్ నేషన్' హోదాపై సమీక్షను వచ్చే వారానికి వాయిదా వేశారు.
Breaking: India carries out surgical strikes across the LoC in Pakistan occupied Kashmir.
— Suhasini Haidar (@suhasinih) September 29, 2016
DGMO Ranbir Singh : recd info yesterday on terror teams, the Indian army has conducted surgical strikes on terror launchpads
— Suhasini Haidar (@suhasinih) September 29, 2016
DGMO Ranbir Singh : have spoken to Pakistan DGMO and shared our concerns. We cannot allow terrorists to operate along LoC
— Suhasini Haidar (@suhasinih) September 29, 2016












Click it and Unblock the Notifications