ఆపరేషన్ సింధూర్ 2.0-మ్యాప్ లో లేకుండా చేస్తాం..! ఆర్మీఛీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్..!

భారత్-పాక్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. తాజాగా సర్ క్రీక్ సరిహ్దదు ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక కార్యకలాపాలను పెంచడం, నిర్మాణాలు చేపడుతుండటంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఇప్పటికే రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్తాన్ కు తీవ్ర హెచ్చరికలు చేశారు. అయినా పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఇవాళ ఆర్మీ ఛీఫ్ ఉపేంద్ర ద్వివేదీ మరింత తీవ్ర హెచ్చరిక చేశారు.

ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపకపోతే మ్యాప్ లో నుంచి పాకిస్తాన్ ను తుడిచిపెడతామంటూ ఆర్మీఛీప్ ఉపేంద్ర ద్వివేదీ పొరుగుదేశాన్ని హెచ్చరించారు. పాకిస్తాన్ తన స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటే ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాలని సూచించారు. రాజస్థాన్‌లోని అనుప్‌గఢ్‌లోని ఒక ఆర్మీ పోస్ట్‌లో జనరల్ ద్వివేది ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి భారత దళాలు ఎటువంటి సంయమనం పాటించవని, ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడాన్ని ఆపకపోతే ఆపరేషన్ సింధూర్ రెండో వెర్షన్ ఎంతో దూరంలో లేదని స్పష్టం చేశారు.

Indian Army Chief Upendra Dwivedi Warns Pakistan Stop Terrorism or Face Erasure

ఈసారి ఆపరేషన్ సిందూర్ 1.0లో చూపిన సంయమనాన్ని ఇకపై కొనసాగించబోమని పాకిస్తాన్ ను ఆర్మీ ఛీఫ్ హెచ్చరించారు. ఈసారి పాకిస్తాన్ భౌగోళికంగా తన స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటుందా లేదా అని ఆలోచించేలా చేసే పని చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సైనికులు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. దేవుడు కోరుకుంటే, మీకు త్వరలో అవకాశం లభిస్తుందంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

Indian Army Chief Upendra Dwivedi Warns Pakistan Stop Terrorism or Face Erasure

ఆపరేషన్ సిందూర్ సమయంలో అసాధారణంగా పనిచేసిన ముగ్గురు అధికారులను ఆర్మీ చీఫ్ ఇవాళ సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎఫ్ 140వ బెటాలియన్ కమాండెంట్ ప్రభాకర్ సింగ్, రాజ్‌పుతానా రైఫిల్స్ మేజర్ రితేష్ కుమార్ , హవల్దార్ మోహిత్ గైరా ఈ గుర్తింపు అందుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమాయక ప్రాణాలకు హాని కలిగించకూడదని, సైనిక లక్ష్యాలను నాశనం చేయకూడదని భావించామని, ఉగ్రవాద స్థావరాలు, శిక్షణా కేంద్రాలు , వాటి సూత్రధారులను నిర్మూలించడంపై దృష్టి సారించామని ఆర్మీ చీఫ్ తెలిపారు. అప్పట్లో తమ విధ్వంసంపై ప్రపంచానికి ఆధారాలను ఇచ్చామన్నారు. తాము అలా చేయకపోతే పాకిస్తాన్ నిజాన్ని దాచిపెట్టి ఉండేదని ఆర్మీ ఛీఫ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+