ఆర్మీ మొగుడు, పోలీసు పెళ్లాం అక్రమ సంబంధం, ప్రియుడు కాదు మా అన్నయ్య, హోమ్ మంత్రి ఎంట్రీ!
బెంగళూరు: భారతదేశ భద్రత కోసం తాను జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీలో ఉద్యోగం చేస్తుంటే సొంత ఊరిలో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న తన భార్య అక్రమ సంబంధం సాగిస్తుందని, ఎన్నిసార్లు చెప్పినా పద్దతి మార్చుకోవడం లేదని, మా కుటుంబం తల ఎత్తుకుని తిరగలేకపోతుందని, మీరే న్యాయం చెయ్యాలని కర్ణాటక హోమ్ మంత్రికి జవాను భర్త ఫిర్యాదు చేశారు. ఆర్మీ యూనిఫాంలోనే హోమ్ మంత్రికి పోలీసు భార్య మీద ఆర్మీ మొగుడు ఫిర్యాదు చెయ్యడంతో సంబంధిత అధికారులు ఈ పోలీసు భార్య విషయంపై విచారణ మొదలు పెట్టారు. తన ప్రియుడు కాదని, మా అన్నయ్య అంటూ తన భార్య నమ్మించడానికి ప్రయత్నిస్తున్నదని ఆర్మీ ఉద్యోగి వాపోతున్నాడు.

రెండు నెలలు హ్యాపీగా సంసారం
కర్ణాటకలోని కొడుగు ప్రాంతానికి చెందిన పూర్ణిమా, మడికేరికి చెందిన ప్రశాంత్ ల వివాహం ఆరు నెలల క్రితం పెద్దలు కుదుర్చిన ముహూర్తినికి ఘనంగా జరిగింది. ప్రశాంత్, పూర్ణిమా వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరై నవదంపతులను ఆశీర్వదించారు.

మిలటరి మొగుడు, పోలీసు పెళ్లాం
ప్రశాంత్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొడుగులోని గోణికొప్పలు పోలీస్ స్టేషన్ లో పూర్ణిమా కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది. వివాహం జరిగిన రెండు నెలల వరకు ప్రశాంత్, పూర్ణిమా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. తరువాత ప్రశాంత్ జమ్మూ కాశ్మీర్ లో ఉద్యోగం చెయ్యడానికి వెళ్లాడు. పూర్ణిమా కుటుంబ సభ్యుల దగ్గర నివాసం ఉంటూ గోణికొప్పలు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది.

సాటి పోలీసుతో అక్రమ సంబంధం
పూర్ణిమా తనతో పాటు గోణికొప్పలు పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్న కానిస్టేబుల్ మోహన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తోందని ప్రశాంత్ కు సమాచారం అందింది. జమ్మూ కాశ్మీర్ నుంచి భార్య పూర్ణిమాకు ఫోన్ చేసిన భర్త ప్రశాంత్ ఏమిటి నీ విషయం ?, ఎందుకు ఇలా చేస్తున్నావ్ ? అంటూ ఆరా తీశాడు.

ప్రియుడు కాదు మా అన్నయ్య
ఫోన్ చేసి భర్త ప్రశాంత్ మొత్తం విషయం ఆరా తీస్తున్నాడని తెలుసుకున్న పూర్ణిమా హడలిపోయింది. తరువాత మోహన్ ఎవరో కాదని, వరుసకు తనకు అన్నయ్య అవుతాడని, ఎవరో మీకు కావాలనే తన మీద చెడుగా చెబుతున్నాడని పూర్ణిమా భర్త ప్రశాంత్ కు మాయమాటలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించింది.

వీడియో కాల్స్, చాటింగ్స్
ఇటీవల ప్రశాంత్ భార్య పూర్ణిమాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా సొంత ఊరికి చేరుకున్నాడు. మోహన్ తన భార్యకు ఎమి అవుతాడు ? అంటూ ఆరా తీశాడు. భార్య పూర్ణిమా, మోహన్ కు ఎలాంటి బంధుత్వం లేదని ప్రశాంత్ విచారణలో వెలుగు చూసింది. భార్య పూర్ణిమా మొబైల్ ఫోన్ తీసుకుని పరిశీలించగా అందులో మోహన్, ఆమె అసభ్యంగా వీడియో కాల్స్ చేసి మాట్లాడుకోవడం, అంతే అసభ్యంగా మెసేజ్ లు పంపించుకోవడం చేశారని ప్రశాంత్ గుర్తించాడు.

ఐదు సార్లు వార్నింగ్
నీ పద్దతి మార్చుకోవాలని, లేదంటే మన ఇరు కుటుంబ సభ్యుల పరువు పోతుందని పూర్ణిమాకు తాను నచ్చచెప్పానని ప్రశాంత్ అంటున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఐదు సార్లు తాను మోహన్ తో అక్రమ సంబంధం సాగించామని, ఇక ముందు బుద్దిగా ఉంటానని, నన్ను నమ్మాలని తన భార్య పూర్ణిమా తప్పు అంగీకరించిందని ప్రశాంత్ అంటున్నాడు. అయితే తన తప్పును సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని, తాను బుద్దిగా కాపురం చేసుకుంటానని పూర్ణిమా భర్త ప్రశాంత్ ను వేడుకుంది.

ఓపిక లేదు స్వామి
ఐదు సార్లు తప్పు అంగీకరించిన భార్య పూర్ణిమాలో ఎలాంటి మార్పు రాలేదని, మళ్లీ సాటి కానిస్టేబుల్ మోహన్ తో కలిసి తిరుగుతోందని తెలుసుకున్న భర్త ప్రశాంత్ విసిగిపోయాడు. ఆర్మీ యూనిఫాం వేసుకుని నేరుగా బెంగళూరు చేరుకుని కర్ణాటక హోమ్ మంత్రిని కలిసి భార్య పూర్ణిమా మీద ఫిర్యాదు చేశాడు.

హోమ్ మంత్రి సీరియస్
తన భార్య పూర్ణిమాకు చాలా సార్లు పద్దతి మార్చుకోవాలని అవాకాశం ఇచ్చానని, అయితే తన భార్య పూర్ణిమా పని చేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే ఉద్యోగం చేస్తున్న సాటి పోలీసు మోహన్ ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్నాడని, మీరే నాకు న్యాయం చెయ్యాలని ప్రశాంత్ హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి ఫిర్యాదు చేశారు. ఆర్మీ ఉద్యోగి ప్రశాంత్ ఫిర్యాదు చెయ్యడంతో వెంటనే విచారణ జరిపి తప్పు చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు హోమ్ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆర్మీ ఉద్యోగికే ఇలా అన్యాయం జరిగితే ఎలా అంటూ హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ సీరియస్ అయ్యారని పోలీసు వర్గాలు అంటున్నాయి.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications