మయన్మార్ సరిహద్దుల్లో భారత్ మెరుపుదాడి! భారీగా నాగా తీవ్రవాదుల హతం?

మయన్మార్ సరిహద్దుల్లో బుధవారం తెల్లవారుజామున భారత్ భారీ ఆపరేషన్ జరిపింది. నాగా తిరుగుబాటుదారులపై భారత సైన్యం విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఎన్ఎస్‌సఎన్(కే) ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

న్యూఢిల్లీ: మయన్మార్ సరిహద్దుల్లో బుధవారం తెల్లవారుజామున భారత్ మెరుపుదాడులు జరిపింది. నాగా తిరుగుబాటుదారులపై భారత సైన్యం విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఎన్ఎస్‌సఎన్(కే) ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

బుధవారం తెల్లవారుజామున 4.45 గంటలకు ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో ఈ దాడులు జరిగాయి. సుమారు 70 మంది భార‌త జ‌వాన్లు నాగా తీవ్రవాదుల శిబిరాల‌పై మెరుపుదాడులు చేశారు.

ఈ ఆప‌రేష‌న్‌లో పెద్ద ఎత్తున నాగా తీవ్ర‌వాదులు హ‌త‌మైన‌ట్లు తెలుస్తోంది. నాగా తీవ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు భారత సైన్యం తెలిపింది.

Indian Army strikes hideouts of Naga militants on Myanmar border

ఈ ఆపరేషన్ కోసం అంతర్జాతీయ సరిహద్దులను దాటలేదని, ఇవి సర్జికల్ దాడులు కావని, దాడుల వల్ల భారత సైన్యానికి ఎటువంటి నష్టం జరగలేదని, భారత సైనికులు గాయపడినట్లు వచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవమని సైన్యం ప్రకటించింది.

స‌రిగ్గా ఏడాది క్రితం పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో భార‌త సైన్యం స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా మయన్మార్ సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడిన నాగా తీవ్ర‌వాదుల‌ను కూడా భార‌త సైన్యం హ‌త‌మార్చింది.

నాగా తీవ్ర వాదుల‌పై జరిగిన కాల్పుల్లో తూర్పు స‌రిహ‌ద్దు బ‌ల‌గాలు పాల్గొన్నట్లు ఇండియన్ ఆర్మీ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+