Helicopter Crash: కొచ్చి విమానాశ్రయంలో కూలిపోయిన హెలికాప్టర్..

భారత కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ALH ధ్రువ్ మార్క్ 3 కుప్పకూలిపోయింది. కేరళ కొచ్చిలోని విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే హెలికాప్టర్ క్రాష్ అయింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎవరు ప్రాణాలు కోల్పోలేదని చెప్పారు. హెలికాప్టర్ శుక్రవారం మధ్యాహ్నం 12:25 గంటలకు టేకాఫ్ అయింది.టేకాప్ అయిన కొద్దిసేపటికే భూమికి కేవలం 25 అడుగులు ఎత్తులో ఉండగా కూలిపోయినట్లు వివరించారు.

అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై ఐసీజీ దర్యాప్తు చేస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రధాన రన్‌వేకు ఆటంకం కలగకుండా హెలికాప్టర్ శిథిలాలను వెంటనే పక్కకు తప్పించారు. పైలట్లు హెలికాప్టర్ ను సాధ్యమైనంత సాఫీగా ల్యాండ్‌ అయ్యేలా చూశారని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో హెలికాప్టర్‌లోని ఒక వ్యక్తి చేతికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. హెలికాప్టర్ రెక్కలు, ఎయిర్‌ఫ్రేమ్‌ దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు.

Indian coast guard helicopter crashes at kochi international airport on friday

ఈ ప్రమాదంతో కొచ్చి విమానాశ్రయంలో కార్యకలాపాలను రెండు గంటల పాటు నిలిపివేశారు. ఇక్కడికి వచ్చే విమానాలను తిరువనంతపురం, కోయంబత్తూర్‌ విమానాశ్రయాలకు మళ్లించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రాకపోకలను పునరుద్ధరించారు. ఇంకా కొద్ది రోజుల క్రితం ముంబై తీరంలో నేవీ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో మార్చి 8 నుండి ALH ధృవ్ ఛాపర్స్ విమానాలు నిలిచిపోయాయి.

వారం క్రితం జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వీరిలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారానికి చెందిన లెఫ్ట్‌నెంట్‌ కర్నల్‌ వినయ్‌ భానురెడ్డి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+