సరికొత్తగా: ఫ్లయింగ్ బర్డ్ కేజ్‌లో పెళ్లి వేదిక వద్దకు వధూవరులు (వీడియో)

ఢిల్లీ: ఓ జంట పెళ్లి మండపానికి పక్షిలా ఉండి ఎగిరే ఓ ఎలక్ట్రిక్ పంజరంలో (ఫ్లయింగ్ బర్డ్ కేజ్) వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల పెళ్లి చేసుకోవడం మొదలు.. పిల్లలకు పేర్లు పెట్టే వరకు.. అన్నింటా కొత్త ఆలోచనలు చేస్తున్నారు.

ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ జంట మరికొంత కొత్తగా ఆలోచించి ఎగురుకుంటూ వచ్చింది. సాధారణ పద్ధతిలో వివాహం చేసుకుంటున్నప్పటికీ.. కొత్తగా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు.

జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే పెళ్లి ఘట్టాన్ని విభిన్నంగా చూడాలని చాలామంది భావిస్తున్నారు. ఓ జంట పెళ్లి మండపంలోకి ఈ పంజరంలో వచ్చింది. భారీ ఎలక్ట్రిక్‌ పంజరం ఏర్పాటు చేసి అందులో వధూవరులు నిలబడేలా రూపొందించారు.

Indian Couple Makes Smashing Entrance In Giant Flying Bird Cage At Wedding & It Has To Be Seen

పెళ్లి వేడుక జరిగే చోటుకు ఆకాశం నుంచి ఆ పంజరాన్ని ఓ గద్ద తీసుకువస్తున్నట్లుగా క్రేన్‌ సాయంతో కిందకు దించారు. ఆ పంజరం కిందకు దిగుతున్నప్పుడు వెలుగులు జిమ్ముతున్న దృశ్యాన్ని అక్కడున్న అతిథులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+