వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిషీల్డ్ మూడు నెల‌లే ర‌క్ష‌ణ‌.. బూస్ట‌ర్ డోస్ త‌ప్ప‌దంటున్న నిపుణులు..

|
Google Oneindia TeluguNews

మహమ్మారి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్నిగుప్పిట్లోకి తీసుకుంది . చాపకింద నీరులా వ్యాప్తి చెందుతూ ప్రజలను గడగడలాడిస్తోంది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారిని సైతం వదలడం లేదు. ఈ నేపథ్యంలో చాలా దేశాలు దేశాలు తమ పౌరులకు వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వడం ప్రారంభించాయి. భారత్ లోనూ బూస్టర్ డోస్ ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతుంది.

కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తప్పనిసరి

కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తప్పనిసరి

భారత్‌లోనూ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజురోజుకు విజృంభిస్తుంది. ఈనేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ డోస్ ఇవ్వ‌డం త‌ప్ప‌నిస‌ర‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కరోనాకు రెండు డోసుల వ్యాక్సినేష‌న్ ఎక్కువకాలం ర‌క్ష‌ణగా ఉండదని చెబుతున్నారు. కాబట్టి బూస్ట‌ర్ డోస్ తీసుకోవ‌డం ఉత్తమనని ఢిల్లీలోని ఐఎల్‌బీఎస్ ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎస్‌కే స‌రీన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా మనం ఏదైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు దాని ప్రభావం మూడు నుంచి ఆరు నెలల్లోనే తగ్గిపోతుందని తెలిపారు. అందుచేతనే బూస్టర్ డోస్ తీసుకోవాలని .. దీంతో ఇన్‌ఫెక్ష‌న్ తీవ్రమయ్యే ప్రమాదం తగ్గుతుందని డాక్టర్ ఎస్కే సరీన్ పేర్కొన్నారు.

 కొవిషీల్డ్ వ్యాక్సిన్ ప‌నితీరు 3 నెల‌లే..

కొవిషీల్డ్ వ్యాక్సిన్ ప‌నితీరు 3 నెల‌లే..

కాగా, తాజాగా భారత్‌లో ఉపయోగిస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ పనితీరుపై ఎడిన్ బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ఆధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నా 3 నెలలే పనిచేస్తుందని తెలిపారు. కరోనాను ఎదుర్కొనే రఓణ క్రమంగా ఓీణిస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. బూస్టర్ డోసు ద్వారా ప్రమాదకర ప్రమాదకర వేరియంట్ల నుంచి రక్ష‌ణ పొందవచ్చని తెలిపారు. ఈ పరిశోధకులు కేవలం ఒక్క కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారినే పరిగణలోకి తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

3. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అల‌ర్ట్

3. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అల‌ర్ట్

కరోనా డెల్టా వేరియంట్ కంటే మూడు రేట్లు వేగంతో ఒమిక్రాన్ వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర అప్రమత్తం చేసింది. నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని సూచించింది. కంటైన్మెంట్ విషయంలో చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొంది. కేసులు పెరుగుదలను బట్టి ఆప్రాంతాలపై ప్రత్యక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన చోట్ల రాత్రి కర్ప్యూ విధించాలని సూచించింది. పెళ్లిళ్లు, ఉత్సవాల్లో పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడకుండా నియంత్రించాలని కోరింది. వైరస్ బాధితలు హోం ఐసోలేషన్ తప్పని సరిగా పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్రాలకు కేంద్ర స్పష్టం చేసింది.

English summary
covishield vaccine protection only three months.. covid vaccine booster dose must
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X