వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మీ దేశానికి వెళ్లిపో’: న్యూజిలాండ్ పాకిన విద్వేషం, భారతీయుడికి అవమానం(వీడియో)

ఇప్పటి వరకు అమెరికాకే పరిమితమైన విద్వేష దాడులు ఇప్పుడు న్యూజిలాండ్‌కు కూడా పాకాయి. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న విద్వేషపూరిత దాడులు మరవకముందే న్యూజిలాండ్‌లో ఓ భారతీయుడిపై జరిగిన దాడి ప్రవాసభారతీయుల

|
Google Oneindia TeluguNews

అక్లాండ్: ఇప్పటి వరకు అమెరికాకే పరిమితమైన విద్వేష దాడులు ఇప్పుడు న్యూజిలాండ్‌కు కూడా పాకాయి. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న విద్వేషపూరిత దాడులు మరవకముందే న్యూజిలాండ్‌లో ఓ భారతీయుడిపై జరిగిన అవమానకర ఘటన ప్రవాసభారతీయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో ఓ భారతీయ సిక్కు వ్యక్తిపై స్థానికుడు గతవారం చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అక్లాండ్‌లో ఉండే నరీందర్వీర్‌ సింగ్‌ పార్కింగ్‌లో నుంచి కారు తీస్తుండగా ఓ జంట కారులో వచ్చింది. వీరు వెళ్లిపోయేందుకు తను దారి ఇచ్చినప్పటికీ.. కారు నడుపుతున్న వ్యక్తి అసభ్య పదజాలంతో దూషిస్తూ దేశం విడిచి వెళ్లాలని బెదిరించాడని నరీందర్వీర్‌ వాపోయారు.

'వారు వెళ్లేందుకు నేను పక్కకు తప్పుకున్నా. కారులోని మహిళ నావైపు వేలు చూపించింది. కారులోని వ్యక్తి నన్ను దూషిస్తూ.. అసభ్యంగా దూషించాడు. ఈ మొత్తాన్ని నేను వీడియో తీశాను. దీంతో అతడు మరింత రెచ్చిపోయి తిట్టాడు. మీ దేశానికి వెళ్లిపోండంటూ బెదిరించాడు. పంజాబీల గురించి చాలా అవమానంగా మాట్లాడాడు' అని నరీందర్వీర్‌ తెలిపారు.

ఇంతటితో అయిపోయింది కదా అని వెళ్లిపోతుంటే.. అదే జంట రోడ్డు పక్కన కారు ఆపుకుని మరీ మరోసారి తనపై మాటలతో దాడి చేశారని 'నిగ్గర్‌ (నల్లజాతీయులు) వెళ్లిపో' అంటూ బెదిరించాడని నరీందర్వీర్‌ వెల్లడించారు.

Indian man claims racial abuse in New Zealand, told to ‘go back to his country’

ఇది ఇలా ఉండగా, న్యూజిలాండ్‌లో జరిగిన మరో ఘటనలోనూ విక్రమ్‌జిత్‌ సింగ్‌ అనే యువకుడిపైనా స్థానికుడొకరు అసభ్యంగా దూషించాడు. న్యూజిలాండ్‌లో ఎంత వేగంగా నడపాలో తెలియదా? అని గద్దించిన స్థానికుడు.. మీ దేశానికి వెళ్లిపోండి అని బెదిరించాడు. కాగా, ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడయ్యాక అమెరికాతోపాటు న్యూజిలాండ్‌లోనూ ఇలాంటి ఘటనలు తరచూ ఎదుర్కొనాల్సి వస్తోందని ప్రవాస భారతీయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

English summary
An Indian national in New Zealand was assaulted, subjected to a racist tirade and told to go back to his own country during a road rage incident in Auckland, a media report said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X