దావూద్ కీలక రహస్యాలు తెలుసు, కానీ: గుజరాత్ యువకుడు

అహ్మదాబాద్: భారత్‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం గురించి పూర్తి సమాచారాన్ని గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు హ్యాక్ చేసినట్లుగా చెబుతున్నాడు. దానిని తాను నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇస్తానని చెబుతున్నాడు.

దావూద్ ఇబ్రహీం గురించిన చాలా విలువైన రహస్య సమాచారం తన వద్ద ఉందని గుజరాత్‌కు చెందిన మనీష్ భాంగోరే చెబుతున్నాడు. ఆయన మాట్లాడిన ఫోన్ కాల్స్ తాను రికార్డు చేశానని, తన వద్ద ఉన్న సాక్ష్యాలను ప్రభుత్వానికి ఇస్తానంటున్నాడు.

Indian man hacks Dawood Ibrahim's call details, plans to give many secret details to PM Modi

వీటిని తాను ప్రధాని మోడీకి మాత్రమే ఇస్తానని చెబుతున్నాడు. తన వద్ద ఉన్న సాక్ష్యాలు తప్పయితే, ఉరితీయాలని మనీష్ వ్యాఖ్యానించినట్టు ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. తన వద్ద దావూద్ ఇబ్రహీం వివరాలు వెల్లడించే ఎంతో సమాచారం ఉందని చెప్పాడు.

భారత్ నుంచి దుబాయ్‌కి నల్లధనాన్ని పంపించేందుకు దావూద్ ఇబ్రహీం వేసిన ప్రణాళికల వివరాలున్నాయని చెబుతున్నాడు. ఈ సమాచారాన్ని సేకరించేందుకు తన జీవితాన్ని కూడా పణంగా పెట్టానని, తొలి దశలో తనను ప్రోత్సహించిన వడోదరా పోలీసులు, అపై అనవసర ప్రశ్నలతో వేధించారని, ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రయత్నించినా, కుదరలేదని చెబుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+