Rains: పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. మన రాష్ట్రంలో కూడా వానలు..
దేశవ్యాప్తంగా పలు రాష్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. రాబోయే నాలుగు రోజులు పలు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. జమ్మూ, కాశ్మీర్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో నదులు ఉగ్రరూపం దాల్చాయి. పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. అనేక రాష్ట్రాలకు ముఖ్యమైన వర్షపాత హెచ్చరికను జారీ చేసింది.
రాబోయే నాలుగు రోజులు, ముఖ్యంగా జూలై 26 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. ఈ తాజా వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, దేశంలోని ఇతర కొండ ప్రాంతాలలో మరిన్ని కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని తెలిపింది. జులై 24, జులై 25 న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హర్యానా, చండీగఢ్‌లో కూడా జూలై 26 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

జులై 24 నుంచి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ వారంలో ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో వర్షాలు రాకపై ఐఎండీ క్లారిటీ ఇవ్వలేదు. ఢిల్లీలో యమునా నీటి మట్టం ఇప్పటికే ప్రమాద స్థాయి మార్కును దాటి ప్రవహిస్తోంది. గుజరాత్, గోవాలకు జూలై 24 నుంచి 26 వరకు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు జూలై 26 వరకు కూడా భారీ వర్షపాతం హెచ్చరిక జారీ చేసింది.
రాబోయే మూడు రోజుల పాటు ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్రలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో గుజరాత్, మహారాష్ట్రల్లో రెడ్ అలర్ట్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, గోవా, కేరళలో భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications