Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమెరికాపై ఉగ్రదాడి పట్ల భారత్ ఆందోళన..

Colarado attack: అమెరికాపై ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. కొలరాడోలోని ఓ మాల్ పై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదని పోలీసులు వెల్లడిాంచారు.

కొలరాడో బౌల్డర్ లో గల పెరల్ స్ట్రీట్ మాల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 1:26 నిమిషాలకు ఈ దాడి సంభవించింది. పెరల్ స్ట్రీట్ మాల్ లో ఓ సెలబ్రేషన్ లో పాల్గొన్న వాళ్లపై ఓ వ్యక్తి మొలొటొవ్ కాక్ టెయిల్ వంటి కెమికల్ ను చల్లాడు. దీన్ని ఫైర్ బాంబ్స్ గా ఆ తరువత పోలీసులు నిర్ధారించారు.

Indian MPs delegation led by MP Shashi tharoor concern on terror attack in Boulder Colorado

రెండు పెద్ద బాటిళ్లతో అతను సంఘటనస్థలానికి చేరుకోవడం, హఠాత్తుగా అక్కడున్న వాళ్లపై దీన్ని చల్లడానికి సంబంధించిన వీడియోలు విడుదల అయ్యాయి. ఈ ఘటనలో పలువురికి కాలిన గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని ఇజ్రాయెల్ మద్దతుదారుడిగా భావిస్తోన్నారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడిపించాలని డిమాండ్ చేస్తూ ఈ దాడికి దిగినట్లు బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్ ఫియర్న్ వెల్లడించారు. బందీలకు సంఘీభావం తెలియజేస్తూ బౌల్డర్ లో రన్ ఫర్ దెయిర్ లైవ్స్ పేరుతో నిర్వహించిన ఓ ర్యాలీలో అతను పాల్గొన్నాడని చెప్పారు.

నిందితుడిని 45 సంవత్సరాల మహ్మద్ సబ్రీ సోలిమన్ గా గుర్తించామని డెన్వర్ ఎఫ్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ అండ్ స్పెషల్ ఏజెంట్ మార్క్ మిఖాలెక్ వెల్లడించారు. ఈ దాడిలో మొత్తం ఆరుమంది గాయపడ్డారని, 45 నుంచి 88 సంవత్సరాలలోపు ఉన్నవాళ్లేనని అన్నారు. దీన్ని ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేస్తోన్నామని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై ఆరా తీస్తోన్నట్లు తెలిపారు.

ఈ ఘటన పట్ల కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు శశిథరూర్ సారథ్యంలోని భారత పార్లమెంట్ ప్రతినిధుల బృందం.. ఆందోళన వ్యక్తం చేసింది. దిగ్భ్రాంతిని తెలియపరిచింది. అమెరికాకు సంఘీభావాన్ని ప్రకటించింది. ఉగ్రవాదం వల్ల సంభవించే విపరిణామాలను తెలియపరుస్తామని పేర్కొంది.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత పాకిస్తాన్ పై భారత్ ఎందుకు యుద్ధానికి దిగాల్సి వచ్చిందనే విషయంపై శశిథరూర్ సారథ్యంలోని పార్లమెంట్ ప్రతినిధుల బృందం వివిధ దేశాల్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. అమెరికాను ఇదివరకే టీమ్. ప్రస్తుతం బ్రెజిల్ లో పర్యటిస్తోంది.

కొలరాడో ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉగ్రవాద దాడిలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిసిన తరువాత ఉపశమనం పొందామని శశిథరూర్ చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియోతో పంచుకుంటామని అన్నారు. ఉగ్రవాదానికి స్థానం ఎక్కడా స్థానం లేదని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+