ట్రంప్ టారిఫ్ లకు వ్యతిరేకంగా వాదించి గెలిచిన నీల్ కత్యాల్ భారత సంతతి లాయర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ లతో భారత ఆర్ధిక వ్యవస్థపై భారం మోపే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ విధించిన భారీ టారిఫ్ ల విధానాన్ని దీటుగా ఎదుర్కోవటానికి భారత్ కూడా తన వంతుగా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇక తాజాగా ట్రంప్ టారిఫ్ ల విధానానికి ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ట్రంప్ టారిఫ్ లపై వాదించింది భారత సంతతి న్యాయవాది
విదేశీ దిగుమతులపై విధించిన భారీ టారిఫ్ లు రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ తీర్పు వెనుక కోర్టులో ట్రంప్ టారిఫ్ లపై వాదించింది భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్. అమెరికా మాజీ యాక్టింగ్ సోలిసిటర్ జనరల్ నీల్ కత్యాల్ మేధస్సు అంతర్జాతీయంగా ఈ కేసుతో చర్చనీయాంశమైంది. అతను భారత సంతతికి చెందిన లాయర్ కావటంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి ఆయనపైన నెలకొంది.

ట్రంప్ టారిఫ్ లను కోర్టులో సవాల్ చేసిన నీల్ కత్యాల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 1977 నాటి 'అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ను ఉపయోగించి ఇంపోర్ట్స్ పై భారీ టారిఫ్ లను విధించారు. చిన్న వ్యాపారుల తరపున భారత సంతతి న్యాయవాది నీల్ కత్యాల్ దీన్ని సవాల్ చేశారు. "అమెరికాలో ప్రజలపై పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కు (పార్లమెంటుకు) మాత్రమే ఉంటుంది. అధ్యక్షుడు ఎంత శక్తివంతుడైనా రాజ్యాంగం కంటే ఎక్కువ కాదని ఆయన తన వాదనలు వినిపించారు.
చికాగోలో స్థిరపడిన భారత సంతతి లాయర్
సుప్రీంకోర్టు దీనిని 6-3 మెజారిటీతో సమర్ధించింది. నీల్ కత్యాల్ తల్లిదండ్రులు భారత్ నుంచి వలస వచ్చిన వారు. వీరు చికాగోలో స్థిరపడ్డారు. ఆయన తండ్రి ఇంజినీర్ కాగా, తల్లి డాక్టర్. అమెరికాలోనే పుట్టిన నీల్, డార్ట్‌మౌత్ కాలేజ్, యేల్ లా స్కూల్ నుంచి లా పట్టా పొందారు. న్యాయవాదిగా అనేక కేసులు గెలిచిన చరిత్ర ఆయనకు ఉంది. ముఖ్యంగా, సుప్రీంకోర్టులో 50కి పైగా కేసులు వాదించి, మైనారిటీ న్యాయవాదిగా రికార్డు సృష్టించారు.
బరాక్ ఒబామా సమయంలో యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ గా పని చేసిన నీల్
బరాక్ ఒబామా హయాంలో 2010లో యాక్టింగ్ సోలిసిటర్ జనరల్‌గా కత్యాల్ పని చేశారు, ప్రస్తుతం జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఆయన పని చేస్తున్నారు. ట్రంప్ విధించిన 'ట్రావెల్ బ్యాన్'ను వ్యతిరేకించడంతో పాటు, జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో కూడా కత్యాల్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 'లిటిగేటర్ ఆఫ్ ది ఇయర్' (2017, 2023), ఎడ్మండ్ రాండాల్ఫ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను కూడా నీల్ కత్యాల్ అందుకున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications