న్యూ ఇయర్ షాక్: టికెట్ ధరలను పెంచిన ఇండియన్ రైల్వే, పెంపు ఇలా..
న్యూఢిల్లీ: కొత్త ఏడాది ప్రయాణికులకు చేదు వార్తనందించింది భారత రైల్వే. జనవరి 1, 2020 నుంచి రైలు టికెట్ ఛార్జీలను స్వల్పంగా పెంచింది. ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్‌కు కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

పెంచిన ఛార్జీలు ఇలా..
మెయిల్ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్‌కు కిలోమీటర్‌కు 2 పైసల చొప్పును పెంచింది. ఏసీ చైర్ కార్, ఏసీ 3, 4 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్‌కు కిలోమీటర్‌కు 4 పైసలు పెంచుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పెంచిన ఛార్జీలు జనవరి 1, 2020 నుంచి అమల్లోకి రానున్నాయని స్పష్టం చేసింది. ఐదేళ్ల నుంచి రైల్వే ఛార్జీలను పెంచని దృష్ట్యా రైలు ఛార్జీలను హేతుబద్ధీకరించామని వెల్లడించింది.

ఐదేళ్ల తర్వాత మరోసారి..
కాగా, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో చివరి సారిగా రైల్వే ఛార్జీలను పెంచారు. అప్పట్లో ప్రయాణికుల ఛార్జీలు 14.2 శాతం, సరుకు రవాణా ఛార్జీలు 6.5శాతం పెరిగాయి. ఛార్జీల పెంపుతోపాటు రైళ్లలో ప్రయాణికుల వసతి, సౌకర్యాలను మెరుగుపరుస్తామని, కోచ్‌ల ఆధునీకరణ, స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

పౌరసత్వ నిరసనల్లో రైల్వేకు భారీ నష్టం..
ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో రైల్వే శాఖకు భారీగా ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు రైల్వే స్టేషన్లకు, రైళ్లకు నిప్పుపెట్టడంతో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రైల్వేకు భారీ నష్టం జరిగింది. ఆందోళనకారులు ఐదు రైల్వే స్టేషన్లకు నిప్పుపెట్టడంతోపాటు ఓ రైలును మొత్తం తగలబెట్టారు. ఈ విధ్వంసం కారణంగా రైల్వేకు రూ. 88కోట్ల ఆస్తి నష్టం జరిగిందని రైల్వే శాఖ పేర్కొంది. ఈ నష్టాన్ని విధ్వంసానికి పాల్పడిన వారి నుంచే వసూలు చేస్తామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ ఇటీవల చెప్పారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications