శుభవార్త:రైల్వే టిక్కెట్టును మరోకరికి బదిలీ చేయొచ్చు
న్యూఢిల్లీ: రైల్వే శాఖ ప్రయాణీకుల కోసం మరో సౌకర్యాన్ని కల్పించింది. ఒకరి పేరుతో రిజర్వేషన్ చేసుకొన్న టిక్కెట్టును మరోకరి పేరు మీద బదిలీ చేసుకొనే అవకాశం కల్పించింది. 24 గంటల్లోపుగా మరోకరి పేరున టిక్కెట్టును బదిలీ చేసుకొనేందుకు రైల్వే శాఖ వెసులుబాటును కల్పించింది.
సుదూర ప్రయాణం కోసం రైల్ేవ టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకొన్న ఆ సమయానికి రైల్వే ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే తాము బుక్ చేసిన టిక్కెట్టును వేరే వ్యక్తులకు బదిలీ చేసుకొనే వెసులుబాటును కల్పించింది.

సాధారణ ప్రయాణికులకు సైతం ఇలాంటి నిబంధనే ఉంది.. కాకపోతే ప్రయాణికుడి కుటుంబ సభ్యులకు అంటే అమ్మానాన్నలకు, భార్య, సోదరులు, అక్కాచెల్లెల్లు, భర్త, కొడుకు, కుమార్తెలకు ఈ నియమం వర్తిస్తుందని రైల్వే శాఖ ప్రకటించింది. రైలు బయల్దేరడానికి 24గంటలలోపు ప్రయాణికులు ఈమేరకు ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ గుర్తింపు కలిగిన విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులయితే... వారు టికెట్‌ను బదిలీ చేసుకోదలిస్తే సంబంధిత విద్యాసంస్థల అధికారి సంతకం చేయాల్సి ఉంది. రైలు బయల్దేరే 48గంటల్లోపు ఈ మేరకు సంతకంతో కూడిన అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications