ప్రముఖ శిల్పి రామ్‌ సుతార్ కన్నుమూత..

ప్రఖ్యాత భారతీయ శిల్పి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత రామ్ వి.సుతార్ మృతి చెందారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన నోయిడాలోని తన కుమారుడి నివాసంలో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గుజరాత్‌లోని ప్రపంచ ప్రసిద్ధ 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ', హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై కొలువుదీరిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాలకు రూపకల్పన చేసి ఆయన బాగా పాపులర్ అయ్యారు. రామ్ సుతార్ కావడం విశేషం.

ముఖ్యంగా గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గౌరవార్థం నిర్మించిన 182 మీటర్ల 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయనకు ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టింది. అలానే హైదరాబాద్ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 125 అడుగుల అంబేద్కర్ మహా విగ్రహాన్ని కూడా రామ్ తీర్చిదిద్దారు.

indian-sculptor-ram-v-sutar-passed-away-due-to-health-issues

కాగా 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని గోందూర్ గ్రామంలో రామ్‌ సుతార్‌ జన్మించారు. శిల్పకళా రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1999లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలానే ఆయనకు 2016లో పద్మభూషణ్ పురస్కారం దక్కింది. సుతార్ మృతి పట్ల పలువురు రాజకీయ, కళారంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+