భారతీయులకు అద్దిరిపోయే న్యూస్.. ఎలాంటి వీసా లేకుండా ఈ 7 దేశాల్లోకి వెళ్లొచ్చు..!

చాలామంది భారతీయులకు ఇతర దేశాల్లో పర్యటించాలని ఉంటుంది. విదేశాల్లో జన జీవనం ఎలా ఉంటుంది. అక్కడ ఉన్న ప్రముఖ ప్రదేశాలు, వాళ్లు ఎలా ఉంటారు. ఏం తింటారు అని తెలుసుకోవాలి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే విదేశాలకు ఎలా వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. వారికి ఇప్పుడు గుడ్ న్యూస్. భారతీయ పాస్ పోర్టును కలిగితే చాలు ఎలాంటి వీసా లేకుండానే నేపాల్, భూటాన్, మలేషియా, థాయిలాండ్, కజకిస్తాన్, మారిషస్, సీషెల్స్ దేశాల్లో పర్యటించే అవకాశం ఉంది. 30 రోజుల పాటు వీసా ఫ్రీ అవకాశాలు ఆయా దేశాలు కల్పిస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా ముందుగా రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్‌ లు, పాస్‌ పోర్ట్ వాలిడిటీకి సంబంధించిన వాటిని సరిచూసుకోవడమే. ఈ దేశాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

భారతీయులకు సులభంగా ప్రవేశం కల్పించే దేశాల్లో నేపాల్ ఒకటి. భారత్ కు సరిహద్దు దేశమైన నేపాల్ లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. నేపాల్ కు ఎలాంటి వీసా అవసరం లేకుండానే కేవలం పర్యటకుడి పాస్‌ పోర్ట్ చూపించి బోర్డర్ దాటేయొచ్చు. నేపాల్ లోని ఖాట్మండు దేవాలయాలు, పొఖారా ప్రాంతం అందాలను చూసి తనివితీరా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే మరో సరిహద్దు దేశం భూటాన్ కు వెళ్లేందుకు కూడా వీసా అవసరం లేదు. కానీ ఎంట్రీ పర్మిట్ అవసరం ఉంటుంది. ఇక భారతీయులకు అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రాంతాల్లో మలేషియా ఒకటి. మలేషియాకు ఎలాంటి వీసా లేకుండానే వెళ్లొచ్చు 30 రోజులపాటు మలేషియాలో ఎంజాయ్ చేయవచ్చు. మలేషియాలో కౌలాలంపూర్, బటు గుహలు, లంకావి దీవులు, పెనాంగ్, కేమరాన్ ఐలాండ్స్, మలక్కా నగరం, జెంటింగ్ హైలాండ్స్ ప్రధాన పర్యటక ప్రాంతాలుగా ఉన్నాయి.

Indianpassport news Here are the 7 countries you can visit visa free with Indian passport in 2026

ఇక థాయిలాండ్ టూర్ అంటే యువత ఎగిరిగంతేస్తుంది. ఇక్కడి బీచ్ లు, నైట్ లైఫ్ ల అందాలకు థాయిలాండ్ పేరుగాంచింది. ప్రస్తుతం థాయిలాండ్ భారతీయులకు 30 రోజుల వీసా ఫ్రీ సదుపాయాన్ని అందిస్తోంది. దాంతో బ్యాంకాక్ లో ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా భారతీయులు చుట్టిరావొచ్చు. అలాగే సెంట్రల్ ఏషియా అందాలను చూడాలనుకునేవారికి కజకిస్తాన్ ప్రాంతం మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ దేశంలో భారతీయులు ఎలాంటి ముందస్తు వీసా లేకుండా 14 రోజులపాటు ఇక్కడ పర్యటించే అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ అల్మాటీ వంటి అందమైన నగరాలు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. ఈ దేశాలతోపాటు మారిషస్ కూడా ఏడాదిలో ఆరు నెలల వరకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తుంది. అలాగే బీచ్ అందాలను ఆస్వాధించాలనుకునేవారికి సీషెల్స్ సరైన చోటని భావిస్తుంటారు. ఇక్కడ ట్రెడిషనల్ వీసా లేకుండా భారతీయులు ఎంచక్కా ఇక్కడి పర్యాటక ప్రాంతాల్లో విహరించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+