మేం దోచుకోం, ఉద్యోగాలు కల్పిస్తాం: యూఎస్ కు భారత్ రిప్లై

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: అమెరికాలో హెచ్ 1 బీ వీసాలపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం అమెరికాతో చర్చించిందని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.అమెరికన్ల ఉద్యోగాలను తాము కొల్లగొట్టబోమని ఆయన ప్రకటించారు.అమెరికన్లకు ఉద్యోగాలను తాము సృస్టిస్తామని ఆయన స్పష్టం చేశారు.

హెచ్ 1 బీ వీసాలపై ఆందోళనల విషయమై కేంద్ర ఐటి శాఖ మంత్రి శుక్రవారం నాడు ముంబైలో జరిగిన కార్యక్రమంలో స్పందించారు.ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్టు ఆయన చెప్పారు.

Indians don't steal jobs, they create: Ravi Shankar Prasad on H1-B visa

హెచ్ 1 బీ వీసాల విషయంలో భారత్ లో నెలకొన్న ఆందోళనల విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్ళినట్టు ఆయన చెప్పారు. భారతీయులు ఉద్యోగాలను లాగేసుకోరని, కొత్త ఉద్యోగాలను సృస్టిస్తారని ఆయన చెప్పారు. వీసాల అంశంపై అమెరికా ఉన్నతాధికారులతో చర్చించినట్టుగా ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు.

తాము చెప్పిన అంశాలను అమెరికా ఉన్నతాధికారులు అర్థం చేసుకొంటారని ఆయన అభిప్రాయపడ్డారు.భారత ఐటి కంపెనీలు అమెరికాతో కలిపి 80 దేశాల్లోని 200 నగరాల్లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. కేవలం ఒక్క అమెరికాలోనే భారత ఐటి కంపెనీలు ఐదేళ్ళలో 20 బిలియన్ డాలర్లు పన్నుల రూపంలో చెల్లించాయన్నారు.అంతేకాదు 4 లక్షల మందికి ఉద్యోగాలను ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

భారత ఐటి కంపెనీలు అమెరికాకు పెద్ద ఆస్తి అని ఆయన ెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పోటీతత్వానికి భారతీయ టెక్నికల్ ఫ్రోఫెషనల్స్ ఎంతగానో సహకరిస్తున్నారని ఆయన అమెరికా యంత్రాంగానికి తెలిపినట్టు రవిశంకర్ చెప్పారు.భారత్ ను డిజిటల్ గా అభివృద్ది చేసేందుకుగాను డిజిటల్ ఇండియా స్టార్టప్ ఇండియా బాగా సహకరిస్తున్నాయని చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IT Minister Ravi Shankar Prasad on Friday said the government had voiced its concern regarding the H1-B visa issue to the US and added that Indians do not steal but create jobs.
Please Wait while comments are loading...