Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆన్ లైన్ గేమింగ్ కత్తికి రెండు వైపులా పదును?

రియల్ మనీ/ఆన్ లైన్ గేమింగ్‌ వల్ల ప్రతి సంవత్సరం సుమారు 45 కోట్ల మంది జేబులకు చిల్లుపడుతోంది. దాదాపు ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల మేర సొమ్మును కోల్పోతున్నారు. సమాజానికి ఇదొక ప్రధాన సమస్యగా మారడం వల్లే కేంద్ర ప్రభుత్వం వీటిని నిషేధించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ నిషేధం వల్ల అటు ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఆదాయపరంగా నష్టపోయినప్పటికీ ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ గేమింగ్ నిషేధం బిల్లును ఆమోదించంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.

India s Online Gaming Ban Could Endanger 2 00 000 jobs and Billions

ప్రతి సంవత్సరం 45 కోట్ల మంది.. తమ కష్టార్జితాన్ని ఆన్ లైన్ గేమింగ్ వల్ల నష్టపోతున్నారని తెలిపింది. దీనివల్ల సంభవించే మొత్తం నష్టం సుమారు రూ. 20,000 కోట్లుగా అంచనా వేసింది. దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు- 2025ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీన్ని ఆమోదింపజేసుకుంది.

ఈ బిల్లు ప్రకారం- మనీ గేమింగ్‌లో పాలుపంచుకున్న సంస్థలపై ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలను అందించే ఏ వ్యక్తికైనా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధిస్తారు.

నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు ఇచ్చే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించే నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది.

ఈ నిషేధం వల్ల పన్ను ఆదాయాలు తగ్గొచ్చని వెల్లడించాయి. అదే సమయంలో వినియోగదారుల భద్రత, జాతీయ డిజిటల్ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవచ్చని, అక్రమ విదేశీ బెట్టింగ్ వెబ్‌సైట్‌లు, మట్కా ఆపరేటర్లను పూర్తిస్థాయిలో నియంత్రించినట్టవుతుందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.

క్యాసినో ఆపరేటర్ల నుండి జీఎస్టీ రూపంలో నాలుగు బిలియన్ డాలర్లకు పైగా అందే పన్నులు పూర్తిగా తగ్గిపోతాయని గేమింగ్ ఇండస్ట్రీ అంచనా వేసింది. ఇది దేశ రియల్-మనీ/ఆన్ లైన్ గేమింగ్‌ ఇండస్ట్రీ ద్వారా అందే 3.5 బిలియన్ డాలర్ల ఆదాయం కంటే చాలా ఎక్కువ.

ఈ రంగం నుంచి సంవత్సరానికి రూ. 25,000 కోట్లకు పైగా ఆదాయం పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందుతోంది. డ్రీమ్ 11, గేమ్స్ 24x7, నజారా టెక్నాలజీస్ (పోకర్‌బాజి), గేమ్స్‌ క్రాఫ్ట్, మొబైల్ ప్రీమియర్ లీగ్ ఈ రంగంలో ఈ రంగంలో టాప్ ప్లేయర్లుగా ఉంటోన్నాయి.

తాజా నిషేధం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ స్కిల్-గేమింగ్ ఇండస్ట్రీకి చెందిన ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఇ-గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తోన్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు మనీకంట్రోల్ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+