ప్రారంభ ధర రూ.1,005... విమాన టిక్కెట్లపై ఇండిగో న్యూ ఇయర్ ఆఫర్
ఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నూతన సంవత్సరం సందర్భంగా విమాన టిక్కెట్లపై ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా న్యూ ఇయర్, హాలిడే డిమాండ్‌ను క్యాష్ చేసుకునే లక్ష్యంతో.. వినియోగదారులను ఆకట్టుకునేలా తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది.
ఎంపిక చేసిన మార్గాల్లో డిస్కౌంట్ ధరల్లో ఈ టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఇండిగో వెబ్‌సైట్ సమాచారం ప్రకారం... జనవరి నెలలో బుకింగ్ కోసం మాత్రమే ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి.

ఢిల్లీ నుంచి లక్నోకి టిక్కెట్ ప్రారంభ ధర రూ.1030గా, బాగ్డోగ్రా నుంచి గౌహతికి ప్రారంభ ధర రూ.1005గా, కోయంబత్తూర్ నుంచి చెన్నైకి రూ.1095గా ఉంది. దీంతోపాటుగా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా జరిపే ఆన్‌లైన్ చెల్లింపులపై ప్రతి ప్యాసింజర్ కన్వీనియన్స్ ఫీజుగా (నాన్ రిఫెండబుల్) రూ.200 అదనంగా చెల్లించాల్సి ఉంది.
ఇక మరికొన్ని ఇండిగో విమాన సర్వీసుల టిక్కెట్ ధరలు చెన్నై నుంచి బెంగళూరుకు రూ.1,120గా, చెన్నై నుంచి కోయంబత్తూరుకు రూ.1,148గా, ఢిల్లీ నుంచి జయపురకు రూ.1,176గా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications